ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడి వస్తానంటే చంద్రబాబునాయుడు వద్దంటున్నారా? రాష్ట్ర పర్యటనకు ప్రధాని అవసరం లేదని చెప్పటం ద్వారా మోడిని చంద్రబాబు అవమానించారా? టిడిపి నేతలు, పచ్చ మీడియా అవుననే అంటున్నాయ్. ఏపికి ప్రధానమంత్రి వద్దామనుకుంటున్నారు..ప్రధాని ప్రారంభించేంత ప్రాజెక్టులేమున్నాయి? లేకపోతే ప్రధానితో శంకుస్ధాపనలు చేయించే కార్యక్రమాలున్నాయా? అంటూ పిఎంవో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అడిగినట్లు ప్రచారం జరిగింది. అదే విషయమై చంద్రబాబు టిడిపి ఎంపిలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు.

‘రాష్ట్రానికి సాయం చేసే దిశగా ప్రధాని ఏదైనా నిర్దిష్ట ప్రకటన చేపేటట్లతే ప్రధాని రావటం మంచిదేనన్నారు. అటువంటిదేమీ లేనపుడు రావటం ఎందుకు? అని చంద్రబాబు ఎంపిలతో అన్నారట. కాబట్టి పిఎంవో చేసిన వాకాబుకు మనం సమాధానం ఇవ్వటం కూడా అనవసరం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దాంతో ప్రధాని రాకను చంద్రబాబు అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం మొదలైంది. ప్రధానమంత్రే రాష్ట్రానికి వస్తానంటే చంద్రబాబు అడ్డుకునే సాహసం చేస్తారా అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న.

అవసరమున్నా లేకపోయినా ప్రముఖుల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు ఏర్పాటు చేయటం చంద్రబాబు పెద్ద విషయం కాదు. గతంలో చాలాసార్లు చంద్రబాబు ఆ పనిచేశారు. ప్రధాని పర్యటనను చంద్రబాబు అడ్డుకుంటున్నారంటే రెండు పార్టీల మద్య వ్యవహారం చాలా దూరమే వెళ్ళేట్లు  అందిరికీ అనుమానాలు మొదలయ్యాయి.