ఉపఎన్నికలొస్తాయా? చంద్రబాబులో ఆందోళన

ఉపఎన్నికలొస్తాయా? చంద్రబాబులో ఆందోళన

వస్తాయనుకుంటున్న ఉపఎన్నికల గురించేనా చంద్రబాబునాయుడులో ఆందోళనంతా ? టిడిపి వర్గాలు అవుననే అంటున్నాయ్. ప్రత్యకహోదా డిమాండ్ తో ఐదుమంది వైసిపి ఎంపిలు రాజీనామాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ స్పీకర్ గనుక రాజీనామాలను ఆమోదిస్తే ఉపఎన్నికలు తప్పవా ? ఇపుడిదే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఒకవేళ స్పీకర్ రాజీనామాలను ఆమోదించి, ఉపఎన్నికలు జరపాలని ఎన్నికల కమీషన్ నిర్ణయిస్తే అప్పుడేమవుతుంది? ఏమవుతుంది చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతుందంతే. ఎందుకంటే, ఉపఎన్నికల్లో వైసిపి తరపున ఎటుతిరిగి ఈ ఐదుమందే పోటీ చేస్తారు. మరి అపుడు టిడిపి ఏం చేస్తుంది? పోటీ పెడుతుందా? పోటీ పెట్టదా?

పోటీ పెట్టినా, పెట్టకపోయినా చంద్రబాబుకు ఇబ్బందే. ఎలాగంటే, పోటీ పెడితేనేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసిపి ఎంపిలు రాజీనామాలు చేస్తే ఉపఎన్నికల్లో వారిపై అభ్యర్ధులను పోటీ పెడుతుందా? అంటూ చంద్రబాబును తప్పుపడతారు.

ఒకవేళ పోటీ పెట్టకపోతే ప్రత్యేకహోదా పోరాటం క్రెడిట్ మొత్తం వైసిపికే దక్కుతుంది. అంతేకాకుండా పోటీ పెట్టినా ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు అభ్యర్ధులను రంగంలోకి దింపలేదని ప్రచారం జరుగుతుంది. దాంతో ఏ విధంగా చూసినా చంద్రబాబుకు ఇబ్బందే అంటున్నారు విశ్లేషకులు.

 

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos