ప్రతిపక్ష ప్రభుత్వాన్ని నిలదీయాల్సినంత స్ధాయిలో నిలదీయలేకపోవటంతో పాటు కెసిఆర్ వేసిన ప్రశ్నలకు భాజపా సమాధానం చెప్పలేక బోర్లాపడింది. సరే అవే ప్రశ్నలు ఏపి పర్యటనలో వేసినా మిత్రపక్షం కాబట్టి చంద్రబాబునాయుడు స్పందించలేకపోయారని సరి పెట్టుకోవచ్చు. అమిత్ షా మూడు రోజులు తెలంగాణాలో పర్యటించినా పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేనట్లే ఉంది.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాల పర్యటనలో ఏం సాధించారనే ప్రశ్న మొదలైంది. మిగిలిన వాళ్ళ విషయం ఎలాగున్నా ఇరు రాష్ట్రాల పార్టీనేతల్లో అయోమయం నెలకొన్నట్లే. మామూలు జనాల విషయాన్ని పక్కన బెడితే అసలు పార్టీ నేతలకే అమిత్ షా పర్యటన సంతృప్తి ఇచ్చిందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే, తెలంగాణాలో టిఆర్ఎస్ ప్రతిపక్షం, ఏపిలో మిత్రపక్షమన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే, ప్రతిపక్ష ప్రభుత్వాన్ని నిలదీయాల్సినంత స్ధాయిలో నిలదీయలేకపోవటంతో పాటు కెసిఆర్ వేసిన ప్రశ్నలకు భాజపా సమాధానం చెప్పలేక బోర్లాపడింది. సరే అవే ప్రశ్నలు ఏపి పర్యటనలో వేసినా మిత్రపక్షం కాబట్టి చంద్రబాబునాయుడు స్పందించలేకపోయారని సరి పెట్టుకోవచ్చు. అమిత్ షా మూడు రోజులు తెలంగాణాలో పర్యటించినా పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేనట్లే ఉంది. ఎందుకంటే, కేంద్రం నుండి తెలంగాణాకు వస్తున్న సాయంపై అమిత్ షా చెప్పిన లెక్కలంతా తప్పులేనంటూ కెసిఆర్ గాలితీసేసారు.
పైగా ప్రభుత్వ వైఫల్యాలపై ధీటుగా స్పందించాలంటూ రాష్ట్రంలోని భాజపా శ్రేణులకు అమిత్ చెప్పిన మాటలు ఆచరణలోకి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే, రాష్ట్రంలో పర్యటించిన ప్రధానమంత్రితో సహా కేంద్రమంత్రులు, నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు కూడా కెసిఆర్ పాలన భేష్ అంటూ మెచ్చుకున్న వాళ్ళే.
కేంద్రం నుండి వచ్చిన వాళ్ళంతా కెసీఆర్ ను మెచ్చుకుంటుంటే రాష్ట్ర భాజపా నేతలు ఏం పోరాటం చేస్తారు? తెలంగాణా ప్రభుత్వం నుండి లబ్ది పొందిన తర్వాత వెంకయ్యనాయడు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతారు? కాబట్టి అమిత్ షా కెసిఆర్ ప్రభుత్వంపై పోరాటం చేయమని ఎంత చెప్పినా ఉపయోగం లేదు.
ఇక ఏపిలో ఏం చేయాలో తెలీక భాజపా నేతలు అవస్తలు పడుతున్నారు. మిత్రపక్షమే అయినప్పటికీ భాజపాకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత చంద్రబాబు ఇవ్వటం లేదన్నది వాస్తవం. ప్రజావ్యతిరేక పాలన కారణంగా రాష్ట్రంలోని మెజారిటీ నేతలు టిడిపితో పొత్తు వద్దని చెబుతున్నారు. ఆ విషయంపై అమిత్ నేతలకు పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు.
అంటే భాజపాలోని చంద్రబాబు అనుకూల, వ్యతిరేక గ్రూపులు ఎవరి రూటులో వారు ప్రయాణం చేయాల్సిందే మరికొంత కాలం. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాజకీయలు స్పీడ్ అవుతాయని చెప్పిన మాట ఏమవుతుందో చూడాలి.
