గుంటూరులోని ప్రముఖ విద్యాసంస్థ భాష్యంలో ఇంటర్ విద్యార్ధి అదృశ్యం ఘటన సంచలనం కలిగిస్తోంది. 24 గంటలు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై విద్యార్ధి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్కూల్‌లోకి తల్లిదండ్రులు వచ్చి నిలదీసేదాక యాజమాన్యం విషయాన్ని గోప్యంగా వుంచింది. అయితే విద్యార్ధి అదృశ్యంపై పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు అధికారులు. దీంతో విద్యార్ధి సంఘాలు,  తోటి విద్యార్ధుల తల్లిదండ్రులతో కలిసి పేరెంట్స్ ఆందోళనకు దిగారు.

సుమారు 800 మంది విద్యార్ధులు వున్న క్యాంపస్‌లో ఒక విద్యార్ధి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బయట ఆడుకోవడానికి వెళ్లిన సదరు విద్యార్ధి ఎంతకు వెనక్కి తిరిగిరాకపోవడంతో అతని క్షేమ సమాచారంపై ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాము వచ్చి 2 గంటలు గడుస్తున్నా క్యాంపస్‌కు ప్రిన్సిపాల్ రాకపోవడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.