వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరంభించిన ప్రజా సంకల్పయాత్రపై తెలుగుదేశంపార్టీ వేగులు ఏం చెప్పారు? మొదటి రోజు రిపోర్టు గురించి ఎటువంటి నివేదిక ఇచ్చారు?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరంభించిన ప్రజా సంకల్పయాత్రపై తెలుగుదేశంపార్టీ వేగులు ఏం చెప్పారు? మొదటి రోజు రిపోర్టు గురించి ఎటువంటి నివేదిక ఇచ్చారు? ప్రస్తుతం ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే, జగన్ పాదయాత్ర ఎంత బ్రహ్మాండమైనా టిడిపి నేతలు మాత్రం ఒప్పుకోరు గాక ఒప్పుకోరు కదా? మొత్తం మీద ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్ పాదయాత్ర మొదటిరోజు రిపోర్టు మాత్రం సూపర్ సక్సెస్ అనే.

జగన్ పాదయాత్రను విజయవంతం చేయటానికి పార్టీ నేతలు, శ్రేణులు పడిన శ్రమ స్పష్టంగా కనబడుతోంది. ఏపార్టీ అధినేత పాదయాత్ర చేస్తున్నా, బహిరంగసభలో పాల్గొంటున్నా ప్లానింగ్ చాలా అవసరం. కానీ ఇక్కడ పాల్గొంటున్నది అధికారంలొ ఉన్న పార్టీ అధినేత కాదు. ప్రధాన ప్రతిపక్ష నేత మాత్రమే. అయినా ఈ స్దాయిలో ప్రజలను సమీకరించారంటే గొప్పగానే చెప్పుకోవాలి. పాదయాత్ర ప్రారంభానికి ముందే నేతలు, శ్రేణులు, అభిమానులు, స్ధానికులు ఇడుపులపాయకు చేరుకోవటంతోనే వైసీపీ మ్యానేజ్ మెంట్ స్కిల్స్ స్పష్టంగా అర్ధమవుతోంది.

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. కేవలం పార్టీ నేతలు జనాలను సమీకరించినంత మాత్రాన ఈ స్ధాయిలో జనాలుండరు. మ్యానేజ్ మెంట్ కు తోడు సహజంగానే జనాల్లో ఉన్న అభిమానం కూడా తోడవ్వటంతోనే ఈ స్ధాయిలో జనాలు హాజరయ్యారు. ఊహించినదానికన్నా జనాలు హాజరవ్వటమే కాకుండా అడుగడుగునా అభిమానులు అడ్డుపడుతుండటంతోనే పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగటం లేదు. కనీసం రెండు గంటల పాటు ప్రతీ చోటా షెడ్యూల్ ఆలస్యమవుతోంది.

ఈ విషయాలనే టిడిపి వేగులు పార్టీలోని ముఖ్యులకు చేరవేసారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంటు కడా జగన్ పాదయాత్ర మొదటిరోజు అద్భుతమని రిపోర్టు సిద్ధం చేసిందట. అయితే, ముందే చెప్పుకున్నట్లు పార్టీ నేతలు ఒప్పుకోవటం లేదు. అందులోనే స్పష్టంగా కనబడుతోంది వారిలోని జెలసీ. ఆ జెలసీని కప్పిపుచ్చుకునేందుకే ‘ప్యారడైజ్ పేపర్ల’లో జగన్ పేరుందంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు.

మంత్రులు అచ్చెన్నాయడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘ప్యారడైజ్ పేపర్ల’ లో పేరుండటం జగన్ అవినీతికి పరాకాష్ట అంటూ మొదలుపెట్టారు. అసలు ప్యారడైజ్ పేపర్లలో జగన్ ఉండటమే అవినీతికి పరకాష్టగా ఒప్పుకుంటే, ఒకపుడు తెహల్కా.కామ్ లో కూడా చంద్రబాబునాయుడు పేరు వచ్చింది. విదేశాల్లో చంద్రబాబుకున్న ఆస్తుల చిట్టా అంటూ పెద్ద జాబితానే ప్రచురించింది. మొత్తం మీద జగన్ మొదటిరోజు పాదయాత్ర మాత్రం సూపర్ సక్సెస్ అని పార్టీ నేతలు సంబర పడుతున్నారు.