కరోనా కారణంగా మరణిస్తున్న రాజకీయ ప్రముఖుల సంఖ్య సైతం నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కోవిడ్ కారణంగా కన్నుమూశారు

కరోనా కారణంగా మరణిస్తున్న రాజకీయ ప్రముఖుల సంఖ్య సైతం నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కోవిడ్ కారణంగా కన్నుమూశారు.

కొద్దిరోజుల క్రితం ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పాలెం చెన్నకేశవ రెడ్డి కుమారుడే శ్రీకాంత్ రెడ్డి.

2009లో తెలుగుదేశం పార్టీ టికెట్‌పై ఆయన కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన శ్రీకాంత్ రెడ్డి నాటి కాంగ్రెస్ అభ్యర్ధి, ప్రస్తుత వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

రాయలసీమ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన పాలెం శ్రీకాంత్ రెడ్డి.. మోడరన్ రాయలసీమ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.