రాంగ్‌కాల్ పరిచయం..ప్రియుడి కోసం భర్త హత్యకు ప్లాన్.. తప్పించుకున్న భర్త

illegal affair: wife planed murder to husband
Highlights

ప్రియుడి కోసం భర్తలను హత్య చేయాలనుకుంటున్న భార్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా ప్రియుడి మోజులో పడి భర్తను చంపేందుకు భార్య పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. 

ప్రియుడి కోసం భర్తలను హత్య చేయాలనుకుంటున్న భార్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా ప్రియుడి మోజులో పడి భర్తను చంపేందుకు భార్య పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ప్రాంతానికి చెందిన ఓ వివాహితకు ఏడాది క్రితం కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకూర గ్రామానికి చెందిన కోటేశ్వరయ్య నుంచి రాంగ్‌కాల్ వచ్చింది.

ఈ సమయంలో మాటలు కలవడంతో.. అది కొంతకాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది నెలల నుంచి అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తోన్న ఆమె తన బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో అతని అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. దీనిలో భాగంగా కోటేశ్వరయ్య అనంతపురం ఆర్టీసీ డ్రైవర్ సుధాకర్‌రెడ్డిని ఆశ్రయించగా అతను ఆటో డ్రైవర్ మురళి మరికొందరితో కలిసి హత్య చేయడానికి రూ.2.50 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

పథకంలో భాగంగా వారు అవసరాల నిమిత్తం అనంతపురానికి వచ్చే భర్తను కాపు కాచి దారిలో హత్య చేయాలని సూచించింది. ఆమె సూచన మేరకు మారణాయుధాలతో కారులో బయలుదేరిన గ్యాంగ్ గురించి పోలీసులకు సమాచారం అందింది..దీంతో  నార్పల వద్ద వాహనాల తణిఖీ చేపట్టగా.. ఒక కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు..

పోలీసుల విచారణలో తామంతా ఓ వ్యక్తిని హత్య చేయడానికి వెళుతున్నట్లు అంగీకరించి ప్లాన్ మొత్తం చెప్పారు. దీంతో కోటేశ్వరయ్య సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పక్కా సమాచారంతో హత్యను అడ్డుకున్న సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
 

loader