మరో మహిళతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని భార్యకు అన్యాయం చేస్తున్న వ్యక్తి ఇదేంటని ప్రశ్నించిన బంధువులపైనే కత్తితో దాడిచేసి హతమార్చడానికి ప్రయత్నించాడు. ఈ దుర్ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుుకుంది.
నెల్లూరు: పిల్లాపాపలతో ఆనందంగా సాగుతున్న కుటుంబంలో అక్రమ సంబంధం (illegal affair) చిచ్చుపెట్టింది. మరో మహిళతో అక్రమసంబంధం కొనసాగిస్తున్న భర్తను భార్య నిలదీయడంతో గొడవ ప్రారంభమై ముగ్గురి ప్రాణాలమీదకు తెచ్చింది. భార్యభర్తల గొడవ చివరకు ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు (nellore district) జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా వింజమూరు (vinjamuru)కు చెందిన అబ్దుల్ బాషా అనే వ్యక్తి కట్టుకున్న భార్య వుండగానే మరో మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. సంసారాన్ని గాలికొదిలేసిన భర్త నిత్యం ప్రియురాలి వద్దే వుండటంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. అయితే ఇటీవల భర్త ఆగడాలు మరీ మితిమీరిపోవడంతో విసిగిపోయిన భార్య పోలీసులను ఆశ్రయించింది.
Video
తన భర్త మరో యువతితో అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు అబ్దుల్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్యాభర్తలిద్దరు కలిసి వుండాలని సూచించి పంపించారు.
అయితే తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్యపై కోపోద్రిక్తుడైన అబ్దుల్ గొడవకు దిగాడు. దీంతో భార్య బందువులు ఆమెకు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలోనే భార్యకు రక్షణగా నిలిచిన బంధువులపై అబ్దుల్ కత్తితో దాడికి దిగాడు. దీంతో ముగ్గురు బంధువులు తీవ్రంగా గాయపడ్డారు.
అబ్దుల్ చేతిలో దాడికి గురయి తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని హాస్పిటల్ కు తరలించారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమించి ఒకరు మృత్యువాతపడ్డారు. మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగానే వుంది. వారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు అబ్దుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. అతడిిపై హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మరో మహిళతో అక్రమసబంధం పెట్టుకుని భార్యకు అన్యాయం చేయడమే కాదు ఇదేంటని ప్రశ్నించిన వారిని చంపడానికి ప్రయత్నించిన అబ్దుల్ ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
ఇదిలావుంటే మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. రెండురోజుల క్రితమే మహిళ భర్తను హతమార్చగా ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పొన్నూరు భావన్నారాయణ కాలనీకి చెందిన నాగరాజు(ఆది) - సోని భార్యాభర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. వివాహం తర్వాత రెండేళ్లపాటు హైదరాబాద్ లో నివాసముండగా గత ఆరేళ్లుగా గుంటూరులో నివాసముంటున్నారు.
అయితే హటాత్తుగా ఏమయ్యిందో తెలీదుగానీ నాగరాజు రెండురోజుల క్రితం మృతిచెందాడు. అయితే ఇప్పటివరకు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రెండురోజుల తర్వాత భర్త బంధువులకు సమాచారమిచ్చింది. దీంతో వారు అనుమానం పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని స్వాదీనం చేసుుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న సోని భర్త నాగరాజు అడ్డు తొలగించుకోవాలనే మరికొందరితో కలిసి హతమార్చినట్లు బంధువులు అనుమానించడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
