సహాయకుడి భార్యతో అఫైర్: సీసీ కెమెరాలతో బట్టబయలు చేసిన వివాహిత భర్త

illegal affair:Man complainsts against his   boss
Highlights

వివాహితతో ఎఫైర్

అనంతపురం:  తన వద్ద పని చేసే సహయకుడి భార్యతో
వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్న ఓ ప్రబుద్దుడి
బండారాన్ని వివాహిత భర్త  బట్టబయలు చేశారు. సీసీ
కెమెరాలను అమర్చి ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు
చేశారు.

అనంతపురం పట్టణంలోని ఓ ప్రార్ధన మందిరంలో పనిచేసే
మత బోధకుడు  తన వద్ద అసిస్టెంట్ గా పనిచేసే వ్యక్తి
భార్యతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకొన్నాడు.

సహయకుడి భార్యతో పరిచయం పెంచుకొని ఆమెతో
వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే తన
భార్యతో పాటు మత బోధకుడి వ్యవహరశైలిపై అనుమానం
వచ్చిన సహాయకుడు ఆధారాలతో సహా వారిని
పట్టుకోవాలనిభావించాడు.

తరచూ ఇంటికి వచ్చి గంటల కొద్దీ తన ఇంట్లోనే గడపడం
పట్ల ఆయనకు అనుమానం వచ్చింది. అయితే  భార్యకు
తెలియకుండానే తమ పడకగదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు 
చేశాడు. 


ఈ సీసీ కెమెరాల  సహాయంతో తన ఇంటికి ప్రబోధకుడు
వచ్చి తన భార్యతో వివాహేతర సంబంధాలను
కొనసాగిస్తున్న విషయాన్ని కనుగొన్నాడు. ఈ ఆధారాలతో
పోలీస్ స్టేషన్ లో అతను  ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని
దర్యాప్తు చేస్తున్నారు.


 

loader