వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్న మహిళపైనే యాసిడ్ తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడో దుండగుడు.   

మైలవరం: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒంటరి మహిళను లోబర్చుకుని వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న ఓ కామాంధుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. మహిళపై యాసిడ్ తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన కట్టా వెంకాయమ్మ(38) భర్త లేడు. దీంతో అదే గ్రామానికి చెందిన పటాపంచుల గోపి(35) ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మగదిక్కు కోసం ఆమెకూడా అతడి వలలో పడింది. ఈ క్రమంలో గతకొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. 

read more ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిని... గొంతుకోసి చంపిన మేనమామ

అయితే ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మాట్లాడుకోవడం లేదు. ఇలా వెంకాయమ్మ తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన గోపి ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. ఇదే ఆవేశంలో ఆమె ఇంటికి బాత్రూంలో వాడే యాసిడ్ తో వెళ్లి దాడి చేశాడు. శరీరమంతా మంటలు రావడంతో ఆమె మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

తనపై జరిగిన యాసిడ్ తో దాడిపై మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గోపి పరారీలో వున్నట్లు...అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.