తిరుపతి: తిరుపతి స్విమ్స్ లో ప్లాస్మా థెరపీకి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.  కరోనా నుండి కోలుకొన్న రోగుల నుండి ప్లాస్మాను సేకరించి చికిత్స చేయనున్నారు.

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వం ఐసీఎంఆర్ కు ధరఖాస్తు చేసుకొంది.దీంతో ప్లాస్మా థెరపీ ద్వారా రోగులకు చికిత్స చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. కరోనా రోగులకు ప్రయోగాత్మకంగా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించనుంది ఆరోగ్య శాఖ.

ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అనేది ప్రయోగాత్మకం మాత్రమే, అధికారిక చికిత్స కాదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ప్రకటించింది. మహారాష్ట్రలో ప్లాస్మా చికిత్స చేసిన తొలి రోగి మృతివాత పడ్డారు. 

also read:మరిన్ని సడలింపులు ఇచ్చిన జగన్ సర్కార్.. బట్ కండీషన్స్ అప్లయ్

ప్లాస్మా థెరపీ చికిత్స కోసం చాలా రాష్ట్రాలు ఐసీఎంఆర్ ను అనుమతి కోరాయి. కేరళ రాష్ట్రంలో కరోనా రోగులకు ప్లాస్మా చికిత్సకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఏపీ రాష్ట్రంలో ఇవాళ్టికి కరోనా కేసులు 2619కి చేరుకొన్నాయి. కోయంబేడు మార్కెట్ లింకులతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదౌతున్నట్టుగా అధికారులు ప్రకటించారు.