శ్రీకాకుళం: ఈ జీవితం తెలుగుదేశం పార్టీకే అంకితమని స్పష్టం చేశారు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. కొన్ని పత్రికలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

తన మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాను బెదిరేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీకోసం నియోజకవర్గ ప్రజలు అహర్నిశలు కష్టపడి గెలిపించారని వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు.  

రాబోయే రోజుల్లో అందరితో కలుపుకుని సమన్వయంతో పనిచేస్తామన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు నియోజకవర్గంలో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే బెందాళం అశోక్.