అందుకే గొట్టిపాటి చేరికను ఆహ్వానించా: కరణం బలరాం

Iam committed to strengthen party says Karanam balaram
Highlights

పార్టీ అవసరాల రీత్యా వైసీపీ ఎమ్మెల్యే  గొట్టిపాటి రవిని పార్టీలో చేర్చుకొనేందుకు తాను అంగీకరించినట్టు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. 

అమరావతి: పార్టీ అవసరాల రీత్యా వైసీపీ ఎమ్మెల్యే  గొట్టిపాటి రవిని పార్టీలో చేర్చుకొనేందుకు తాను అంగీకరించినట్టు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆనాడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తాను  చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయానికి  తాను అంగీకరించినట్టు ఆయన చెప్పారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై కరణం బలరామకృష్ణమూర్తి తన అభిప్రాయాలను వెల్లడించారు. తనకు మంత్రి పదవి కావాలనే కోరిక లేదన్నారు.  పార్టీ బలోపేతం చేసేందుకు మరోకరికి మంత్రి పదవి ఇచ్చినా తాను అడ్డుకోబోనని ఆయన చెప్పారు.

తనను నమ్ముకొన్న క్యాడర్‌ను కాపాడుకోవాలనే తాపత్రయం తనకు ఉంటుందని ఆయన చెప్పారు. తాను  ఏనాడు కూడ పార్టీకి నష్టం కల్గించేవిధంగా వ్యవహరించలేదన్నారు.పదవుల కోసం కూడ ఏనాడూ కూడ పాకులాడలేదన్నారు. 

గొట్టిపాటి కుటుంబంతో అప్పట్లో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని కరణం బలరాం చెప్పారు. ముక్కుసూటిగా మాట్లాడడమే తన నైజమని కరణం బలరామకృష్ణమూర్తి చెప్పారు. 

ఆనాడు దగ్గుబాటి వెంకటేశ్వరావుతో విబేధాల కారణంగా  తాను మార్టూరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. చంద్రబాబునాయుడు వల్లే  తనకు గుర్తింపు వచ్చిందని ఆయన గుర్తు చేసుకొన్నారు. కేఈ కృష్ణమూర్తి, తాను, చంద్రబాబునాయుడు, వైఎస్ఆర్ సమకాలీనులమని  ఆయన చెప్పుకొచ్చారు.

తనది విశాల హృదయమని కరణం బలరాం చెప్పారు. తాను ఏనాడూ  సంకుచితంగా వ్యవహరించలేదని ఆయన తెలిపారు. దామరచర్ల జనార్ధన్‌ ను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదించింది తానేనని కరణం బలరాం చెప్పుకొచ్చారు. 

కార్యకర్తల యోగక్షేమాలే తనకు ముఖ్యమన్నారు. ఎలాంటి పదవులు అవసరం లేదన్నారు. ముక్కుసూటిగా మాట్లాడడమే తన నైజమని చెప్పారు.అద్దంకిలో తన కార్యకర్తలకు న్యాయం చేస్తే సీటు తగాదా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై  చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొంటారని ఆయన చెప్పారు. 

తాను పోటీచేయాలా...తన కొడుకు వెంకటేష్‌కు మాత్రమే బరిలోకి దిగాలా... అనే విషయాలపై బాబు నిర్ణయం తీసుకొంటారని ఆయన చెప్పారు. బాబు నిర్ణయం ప్రకారంగా నడుచుకొంటామని ఆయన  స్పష్టం చేశారు.


 

loader