మిజోరంలో పరిస్థితులను అర్ధం చేసుకొని ముందుకు వెళ్తానని మిజోరం రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. 

విశాఖపట్టణం: మిజోరంలో పరిస్థితులను అర్ధం చేసుకొని ముందుకు వెళ్తానని మిజోరం రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు.మంగళవారం నాడు విశాఖపట్టణంలో ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్‌తో మాట్లాడారు.మిజోరం గవర్నర్ గా వారం రోజుల్లో బాధ్యతలు తీసుకొంటానని ఆయన చెప్పారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈశాన్య రాష్ట్రంలో పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టంగా ఆయన పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

also read:మిజోరం గవర్నర్‌గా హరిబాబు: హర్యానాకు బండారు దత్తాత్రేయ బదిలీ

మిజోరంలో పరిస్థితులను అర్ధం చేసుకొని ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు.కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను, మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ జరిగింది. కొత్త గవర్నర్ల నియామకంలో ఏపీకి చెందిన హరిబాబుకు చోటు దక్కింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేశారు.