తాను ఇకపై  విజయవాడలోనే  ఉండనున్నట్టు ప్రముఖ సినీ విమర్శకులు  కత్తి మహేష్ చెప్పారు. కత్తి మహేష్‌ను  హైద్రాబాద్ నగరం నుండి బహిష్కరిస్తూ  పోలీసులు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

విజయవాడ:తాను ఇకపై విజయవాడలోనే ఉండనున్నట్టు ప్రముఖ సినీ విమర్శకులు కత్తి మహేష్ చెప్పారు. కత్తి మహేష్‌ను హైద్రాబాద్ నగరం నుండి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

హైద్రాబాద్ నగరం నుండి కత్తి మహేష్‌ను బహిష్కరించిన తర్వాత కొంత కాలంగా ఆయన బెంగుళూరులో ఉంటున్నాడు. బెంగుళూరు నుండి కత్తి మహేష్ సోమవారం నాడు విజయవాడకు వచ్చాడు. 

విమానంలో ఆయన బెంగుళూరు నుండి విజయవాడకు వచ్చాడు. ఇక నుండి తాను విజయవాడలోనే ఉండనున్నట్టు కత్తి మహేష్ ప్రకటించారు. తెలంగాణలోని హైద్రాబాద్‌ మినహా ఇతర ప్రాంతాల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం తనకు ఉందన్నారు.

అయితే తాను విజయవాడలోనే ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన చెప్పారు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడినేనని ఆయన చెప్పారు.గన్నవరం విమానాశ్రయంలో కత్తి మహేష్ సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు.

శ్రీరాముడిపై కత్తి మహేష్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో కత్తి మహేష్ ను హైద్రాబాద్ నగరం నుండి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

ఈ వార్తలు చదవండి

కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు, స్వగ్రామానికి తరలింపు