గుంటూరు: అధికార వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందని తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబే స్వయంగా ప్రకటించారు. అయితే తాను ఏమాత్రం బయపడటం లేదని... అతి త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతంగా బయటకు వస్తానంటూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

''కరోనా వచ్చిందని తెలిసి చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐసోలేషన్ లో వుండటంతో ఆ ఫోన్లు రిసీవ్ చేసుకోలేకపోతున్నా. కాబట్టి తన యోగక్షేమాలు తెలుసుకోడానికి ఫోన్ చేసిన వారందరితో పాటు రాష్ట్ర ప్రజల కోసం ఈ వీడియో సందేశాన్ని పంపుతున్నా. నేను ఇకపై కూడా అందుబాటులో వుండటం లేదు కాబట్టి ఫోన్లు చేయవద్దు.

అయితే నేను ప్రస్తుతం చాలా ధైర్యంగా వున్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఉదయం ఆర్టీపిసి టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఓ హాస్పిటల్ చికిత్స కోసం ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే తప్పకుండా బయటకు వస్తాను'' అని అంబటి రాంబాబు వెల్లడించారు. 

వీడియో

"

ఏపీలో ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు కరోనా బారినపడ్డారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కరోనా బారినపడ్డారు. కరోనా నుండి రోశయ్య కోలుకొన్నారు. శివకుమార్ క్వారంటైన్ కే పరిమితమయ్యారు.