న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కలిసిన ప్రతి సారీ  కోరుతూనే ఉంటానని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. మేనిఫెస్టో‌లో చెప్పిన అంశాలను అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం నాడు న్యూఢిల్లీలో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబునాయుడు ఐదేళ్లలో రూ. 2.57 కోట్లు అప్పులు  చేశారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిని ప్రధాన మంత్రికి వివరించినట్టుగా ఆయన తెలిపారు.

రాష్ట్రానికి సహాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్టుగా జగన్ చెప్పారు. రాష్ట్రానికి చెందిన సమస్యలను ప్రధానికి వివరిస్తే ఆయన సానుకూలంగా స్పందించినట్టుగా భావిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.రాష్ట్రానికి అందాల్సిన సహాయం ఆలస్యమైందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం లేని పరిస్థితి ఉందన్నారు. ఎన్డీఏకు 250 కంటే ఎక్కువ సీట్లు రావొద్దని తాను దేవుడిని ప్రార్ధించినట్టుగా జగన్ చెప్పారు.

ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర హక్కు.   ఈ సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇక ఎప్పుడూ కూడ ప్రత్యేక హోదా దక్కదన్నారు. ప్రధాన మంత్రిని కలిసిన ప్రతి సారీ కూడ ప్రత్యేక హోదా గురించి అడుగుతానన్నారు.

సంబంధిత వార్తలు

రాజధాని భూముల్లో కుంభకోణం, అలా అయితేనే ఓట్లడుగుతా: జగన్

పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు