హైదరాబాద్ టూ కడప విమానం హైజాక్..ప్రమాదంలో 100మంది ప్రయాణికులు

hyderabad to kadapa flight hijack
Highlights

తమ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే విమానం పేల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్ టూ కడప వెళ్లే విమానాన్ని కొందరు దుండగులు హైజాక్ చేశారు. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. చాలా చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను రక్షించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం 9గంటలకు కడప నుంచి ఏబీసీ693 విమానం 100మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరింది. కాగా.. విమానం బయలుదేరిన అరగంటకే హైజాక్ అయినట్లు కంట్రోల్ రూంకి సమాచారం అందించింది. అత్యవసరంగా విమానాన్ని గన్నవరం విమానాశ్రయంలో దించేందుకు అనుమతికావాలని పైలెట్ కంట్రోల్ రూం కి సమాచారం అందించారు.

ఆ తర్వాత విమానాన్ని గన్నవరం విమానాశ్రయంలోని ఓ మూలకు నిర్మానుష్య ప్రాంతంలో ల్యాండ్ చేశారు.  అనంతరం హైజాకర్లతో మధ్యవర్తి ద్వారా వారి డిమాండ్లను అధికారులు తెలుసుకున్నారు.

పలు జైళ్లలో ఉన్న తమ నాయకులను తీసుకుని విజయవాడకు తీసుకురావాలి. 2. దేశప్రధానితో మాట్లాడే అవకాశం కల్పించాలి. 3.రూ.500 కోట్లు భారత కరన్సీ తక్షణం ఏర్పాటు చేయాలి. 4. విమానం నిండా ఇంధనం నింపాలి. 5. వేరే దేశానికి విమానం వెళ్లేందుకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేశారు. వారు  తమ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే విమానం పేల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.


అయితే.. హైజాకర్లను మభ్యపెడుతూనే.. డిమాండ్లు పూర్తి చేస్తామని.. అందుకు సమయం పడుతుందని అధికారులు వారిని నమ్మించారు. ఆ లోపు విమానంలో ఇందనం నింపుతామని నమ్మబలికి.. విమానం దగ్గరకు చేరుకున్నారు. చాలా చకచక్యంగా హైజాకర్లను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
 

loader