చిత్తూరు: జిల్లాలోని రామచంద్రాపురం మండలం గడ్డకిందపల్లిలో దారుణం చోటుచేసుకొంది. భార్య గొంతు కోసి తాను గొంతు కోసుకొన్నాడు భర్త.. ఆసుపత్రిలో భర్త చికిత్స పొందుతూ మరణించాడు. 

గడ్డకిందపల్లికి చెందిన వెంకటేష్ రెడ్డికి 34 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం దామరకుప్పంకు చెందిన మహిళతో వివాహమైంది. అయితే కొన్ని కారణాలతో వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత చౌడేపల్లి మండలం మడుకూరుకి చెందిన శిరీషను వెంకటేష్ రెడ్డి ఏడాది క్రితం వివాహం చేసుకొన్నాడు.

పెళ్లి తర్వాత వీరిద్దరూ తిరుపతిలో కాపురం పెట్టారు. లాక్ డౌన్ తో తిరుపతి నుండి స్వగ్రామం గడ్డకిందపల్లికి వచ్చారు.  వీరిద్దరూ తరచూ గొడవపడేవారు.సోమవారం నాడు కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. వెంకటేష్ రెడ్డి భార్యను మామిడి తోటకు తీసుకెళ్లి అక్కడ ఆమె గొంతు కోశాడు.

ఆ తర్వాత తాను కూడ గొంతు కోసుకొన్నాడు. శిరీష అక్కడికక్కడే మరణించింది.కొన ఊపిరితో ఉన్న ఆయనను స్థానికులు చూసి రుయా ఆసుపత్రికి తరలించారు.రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ రెడ్డి మరణించాడు.