తనకు టచ్ ఫోన్ కొనివ్వలేదనే కక్షతో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. శుక్రవారం రాత్రి భార్యతో మరోసారి గొడవపడి ఆమెను తీవ్రస్థాయిలో కొట్టడంతో పాటు కత్తితో ఒళ్లంతా గాట్లు పెట్టాడు. తీవ్రస్థాయిలో రక్తస్రావం కావడంతో చాందిని చనిపోయింది.
తనకు టచ్ ఫోన్ కొనివ్వలేదనే కక్షతో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. వివరాల్లోకి వెళితే.. కడప అల్లూరి సీతారామరాజునగర్‌కు చెందిన చాందినికి అదే ప్రాంతానికి చెందిన మారుతీతో కొంతకాలం క్రితం వివాహమైంది.
పెళ్లి సమయంలో కట్నకానుకల కింద రూ.4 లక్షలు ఇచ్చారు. మారుతీ ముస్లిం అయినప్పటికీ అతని తల్లిదండ్రులు హిందు దేవుడి పేరు పెట్టారు. అతను దుకాణాల వద్దకు వెళ్లి సాంబ్రాణి వేసి వచ్చిన డబ్బుతో కటుుంబాన్ని పోషించేవాడు.
ఈ దంపతులకి వల్లీ అనే కుమారుడు ఉండగా.. ప్రస్తుతం చాందిని రెండోసారి గర్భం దాల్చింది. పెళ్లయినప్పటి నుంచి అధిక కట్నం కోసం భార్యను వేధిస్తుండేవాడు మారుతీ. పది రోజుల నుంచి ఇవి మరింత ఎక్కువయ్యాయి.
చాందినిని కొట్టడంతో పాటు సిగరెట్లతో కాల్చేవాడు. ఈ క్రమంలో తనకు టచ్ ఫోన్ తీసుకురావాలంటూ భార్యపై ఒత్తిడి తీసుకొచ్చాడు. త్వరలోనే అమ్మను డబ్బులు అడిగి కొనిస్తానని చాందిని అతనికి చెప్పింది.
అయితే తాను అడిగినప్పుడు కొనివ్వలేదని భార్యపై అక్కసు పెంచుకున్న మారుతి ఆమెను రెండ్రోజుల క్రితం తీవ్రంగా కొట్టడంతో చాందిని చెయ్యి విరిగింది. శుక్రవారం రాత్రి భార్యతో మరోసారి గొడవపడి ఆమెను తీవ్రస్థాయిలో కొట్టడంతో పాటు కత్తితో ఒళ్లంతా గాట్లు పెట్టాడు.
తీవ్రస్థాయిలో రక్తస్రావం కావడంతో చాందిని చనిపోయింది. ఆందోళనకు గురైన మారుతి .. భార్య శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి పారిపోయాడు. శనివారం ఉదయం బంధువులు, స్థానికులు వెళ్లి చూడగా .. చాందిని రక్తపుమడుగులో విగతజీవిగా పడివుంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 4, 2019, 1:01 PM IST