పాడిగేదెను తక్కువ రేటుకు ఎందుకమ్మావని అడిగిందని కోపానికొచ్చిన భర్త భార్యను హత్య చేసిన దారుణ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. 

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట గ్రామానికి చెందిన పితాని సూర్యనారాయణ ఆదివారం తన భార్య సూర్యకాంతం(60)ను హతమార్చాడు.  

ఆర్థిక అవసరాల రీత్యా ఇంట్లో ఉన్న పాడిగేదెను అమ్మాలని అనుకున్నారు. అయితే అనుకున్న రేటుకన్నా తక్కువకు సత్యనారాయణ గేదెను అమ్మాడు. ఇదే విషయాన్ని తక్కువకు ఎందుకు అమ్మావని సూర్యకాంతం భర్తను నిలదీసింది.

దీంతో కోపానికి వచ్చిన సత్యనారాయణ అర్ధరాత్రి కత్తితో సూర్యకాంతం మెడ, పొట్టపై నరికాడు.  కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ సూర్యకాంతం మృతి చెందింది.