భర్త ఎలాంటి వాడైనా.. తనను ఎంతగా హింసిస్తున్నా సహనంతో ఉన్న భార్యలను చూశాం.. కానీ కట్టుకున్నవాడి కాళ్లు, చేతులు విరగ్గొట్టి ఆరు నెలల పాటు నరకం చూపింది ఓ భార్య.. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నానికి చెందిన సత్యనారాయణకు కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది..

తొలుత సవ్యంగానే సాగిన వీరి సంసారం తర్వాత మనస్పర్థలకు దారి తీసింది. ప్రతిరోజు ఇద్దరి మధ్యా ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉండేది.. ఈ క్రమంలో ఓ రోజు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.. ఆ సమయంలో పట్టరాని కోపంతో భర్త కాళ్లు, చేతులు విరగ్గొట్టింది.

విషయం బయటకొస్తే పరువు పొతుందని.. అతన్ని ఆరు నెలల నుంచి ఇంటిలోనే నిర్భంధించింది.. అక్కడితో ఆగకుండా ప్రతిరోజు భర్తను చిత్రహింసలకు గురిచేసింది.. భార్య బారి నుంచి తప్పించుకున్న సత్యనారాయణ బంధువులకు, గ్రామస్తులకు జరిగిన విషయం చెప్పాడు... వారు అతన్ని ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు.