Asianet News TeluguAsianet News Telugu

ఆస్తిలో వాటా ఇవ్వాలని భార్యను కడతేర్చిన భర్త

పదేళ్ల కిందట దేవుడి సాక్షిగా తాళి కట్టాడు. అర్ధేఛ అంటూ జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. నాలో సగం అంటూ చెప్పుకొచ్చిన ఆ భర్తే ఆస్తి విషయం వచ్చేసరికి మృగంలా మారాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భావించి అర్ధాంతరంగా చంపేశాడు. గుట్టు చప్పుడు కాకుండా శవాన్నికాల్చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. 

Husband kills wife property dispute
Author
Anantapur, First Published Aug 30, 2018, 11:45 AM IST

అనంతపురం: పదేళ్ల కిందట దేవుడి సాక్షిగా తాళి కట్టాడు. అర్ధేఛ అంటూ జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. నాలో సగం అంటూ చెప్పుకొచ్చిన ఆ భర్తే ఆస్తి విషయం వచ్చేసరికి మృగంలా మారాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భావించి అర్ధాంతరంగా చంపేశాడు. గుట్టు చప్పుడు కాకుండా శవాన్నికాల్చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. 

హిందూపురం టౌన్ స్టేట్‌బ్యాంక్‌ వద్ద ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కూతురు దీపికతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు హరిచరణ్. రెండేళ్లు సజావుగా సాగిన వారి సంసారంలో కలతలు చెలరేగాయి. దీంతో దీపిక కుమారుడు హరిచరణ్ తో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య రాకపోవడంతో బాల వినయ్ మరో వివాహం చేసుకున్నాడు.

అయితే దీపిక తనకు భర్త బాలవినయ్ ఆస్తిలో వాటా ఇవ్వాలని హిందూపురంలో కోర్టుకెక్కింది. కోర్టు విచారణలో భాగంగా ఈనెల 27న కుమారుడు హరిచరణ్ తోపాటు హిందూపురానికి వచ్చింది. కేసు తుదిదశకు రావడంతో ఇక ఆస్థి ఇవ్వక తప్పదేమోనని భావించిన బాలవినయ్ మెుదటి భార్య దీపికను కుమారుడు హరిచరణ్ ను ఇంటికి పిలిపించాడు. ఇంటికి వచ్చిన దీపికపై దాడిచేసి హత్య చేశాడు. 

హత్య అనంతరం గుట్టుచప్పుడు కాకుండా కర్ణాటక రాష్ట్రం మధుగిరి సమీపంలోని పోలేపల్లి వద్ద పొలాల్లో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఆ తర్వాత కుమారుడు హరిచరణ్‌ను బెంగళూరులోని అమ్మమ్మ వద్ద వదిలేసి ఏమీ తెలియనట్లు వచ్చేశాడు. తన తల్లిని తండ్రి కొట్టాడని హరిచరణ్ అమ్మమ్మకి చెప్పడంతో దీపిక తల్లిదండ్రులు అరుణ, రాము హిందూపురం వచ్చారు. తమ కుమార్తె కనిపించటంలేదని వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 


అయితే తమ పరిధిలో గుర్తు తెలియని శవం ఉందని మధుగిరి పోలీసులు హిందూపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో కలిసి దీపిక తల్లిదండ్రులు ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా తమ కుమార్తె మృతదేహమేనని గుర్తించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలవినయ్‌ కుటుంబ సభ్యులను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బాలవినయ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios