Asianet News TeluguAsianet News Telugu

భార్యను చంపేసి.. ఎంత కథ నడిపాడు

అనుమానంతో భార్య హత్య

husband kills wife in nellore

అనుమానంతో కట్టుకున్న భార్యను హత్య చేశాడు.. అనంతరం భార్య కనిపించడం లేదంటూ.. నాటకం మొదలుపెట్టాడు. పోలీసులను కూడా తన నటనతో మోసం చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట మండలం శ్రీకొలనుకు చెందిన నంది చెంచుకృష్ణారెడ్డి 30 సంవత్సరాల క్రితం రత్నమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు పుట్టిన తరువాత రత్నమ్మపై అనుమానంతో ఆమెను విడిచిపెట్టాడు. 

మరలా 13 సంవత్సరాల క్రితం చేజర్ల మండలం తూర్పుపల్లికి చెందిన పుష్పను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న కుమారుడు(చంద్రశేఖర్‌రెడ్డి) ఉన్నాడు. రెండేళ్ల క్రితం చెంచుకృష్ణారెడ్డి చెన్నైకు వెళ్లి అక్కడ సరుకులు రవాణా చేసే తోపుడు బండి లాగుతూ డబ్బులు సంపాదించి పుష్పకు పంపేవాడు. పుష్ప సైతం కూలి పనులు, ఉపాధి హామీ పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించేది.

దాచిన డబ్బుతో ఇటీవల పుష్ప శ్రీకొలనులో కొంత భూమిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో చెన్నై నుంచి వచ్చిన చెంచుకృష్ణారెడ్డి అక్కడ పని మానుకుని సంగం మండలం కొరిమెర్ల సమీపంలోని సాంబశివ పాల డెయిరీలో మే ఒకటో తేదీన కాపలాదారు పనిలో చేరాడు. చెంచుకృష్ణారెడ్డికి వరుసకు కుమార్తెలైన సుభాషిణి, పద్మమ్మలు పుష్ప తమ మాట వినడం లేదన్న కోపంతో అతనికి లేనిపోని మాటలు చెప్పారు. 

చెప్పుడు మాటలు విని అనుమానపడిన చెంచుకృష్ణారెడ్డి, సుభాషిణి, పద్మమ్మ వీరికి తెలిసిన మరో యువకుడితో కలసి పుష్ప హత్యకు పథకం వేశారు. ఈ నెల 19న ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన పుష్పను డైయిరీ వద్ద భోం చేస్తామంటూ చెంచుకృష్ణారెడ్డి తన సైకిల్‌పై తీసుకెళ్లాడు. అక్కడ ఈ నలుగురు కలసి పుష్ప గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి డైయిరీ ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టు పాదులో పాతిపెట్టారు. ఇంత దారుణం చేసి అందరూ కలిసి గ్రామానికి వచ్చి నింపాదిగా తిరిగారు. 

ఈ నెల 22న పుష్ప కనిపించడం లేదంటూ ఏఎస్‌పేట పోలీసులకు చెంచుకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామస్తులు వాకబు చేయగా జరిగిన ఘోరం బయటపడింది. దీంతో గ్రామస్తులు సంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios