ప్రియుడితో భార్య రాసలీలలు: ఇంట్లో బంధించి సజీవ దహనం చేసిన భర్త

First Published 4, Jul 2018, 3:39 PM IST
Husband kills wife and her lover in Nellore district
Highlights

భార్యను, ప్రియుడిని సజీవ దహనం చేసిన భర్త

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. జిల్లాలోని ముత్తకూరు మండలంలోని కొల్లమిట్టలో భార్యను, ప్రియుడిని భర్త  బుధవారం నాడు సజీవ దహనం చేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

నెల్లూరు జిల్లా ముత్తకూరు మండలంలోని కొల్లమిట్టలో హరిబాబు తన భార్యను, ఆమె ప్రియుడును సజీవ దహనం చేశాడు.తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని గమనించాడు హరిబాబు.  ఈ విషయమై పలుమార్లు భార్యను మందలించాడు.

కానీ, ఆమె తన ప్రవర్తనను మార్చుకోలేదు. ప్రియుడితో రాసలీలను కొనసాగిస్తోంది. అయితే ఎప్పటి మాదిరిగానే  పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన భర్త హరిబాబు భార్య కదలికలపై కన్నేశాడు.

తాను ఇంట్లో లేని విషయం తెలుసుకొన్న ప్రియుడు హరిబాబు ఇంటికి చేరుకొన్నాడు. దీంతో కోపాన్ని తట్టుకోలేక పోయిన హరిబాబు ఇంటికి చేరుకొన్నాడు. తన భార్యతో ఆమె ప్రియుడు రాసలీలల్లో మునిగి ఉన్న విషయాన్ని గుర్తించి బయటి నుండి  గుడిసెకు నిప్పంటించాడు.

ఒక్కసారిగి మంటలు వ్యాపించడంతో  బయటకు వెళ్లే మార్గం లేక వారిద్దరూ సజీవదహనమయ్యారు. ఇద్దరి మృతదేహాలు గుర్తు పట్టని విధంగా మారిపోయాయి. అయితే ఇంటికి నిప్పంటించిన హరిబాబు  పారిపోయాడు.  నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 


 

loader