Asianet News TeluguAsianet News Telugu

మూడు పెళ్లిళ్లు.. బీమా డబ్బు కోసం.. రెండో భార్యను ఆత్మహత్య చేసుకోమంటూ భర్త వేధింపులు..

ముగ్గురు యువతుల్ని పెళ్లి పేరుతో మోసం చేసి.. రెండో భార్యను ఆత్మహత్య చేసుకోమంటూ వేధించిన ఓ వ్యక్తి ఉదంతం నంద్యాలలో వెలుగు చూసింది. 

husband harassed wife to commit suicide over bheema money in nandyal
Author
First Published Nov 25, 2022, 11:21 AM IST

నంద్యాల : ఓ వ్యక్తి భార్యను చిత్రహింసలు పెట్టాడు. అంతేకాదు. ఆత్మహత్య చేసుకుంటే బీమా వస్తుందంటూ వేదించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది. ముగ్గురు యువతులను పెళ్ళి చేసుకుని ఓ యువకుడు మోసగించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబుకు మార్కాపురానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ విసయం దాచిపెట్టి తన గ్రామానికే చెందిన మరో మహిళను ప్రేమించి నాలుగేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. 

రెండో భార్య ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు సంబంధించిన బీమా డబ్బులు వస్తాయని తల్లి వద్ద ప్రస్తావించాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని భార్యను బలవంతం చేసేవాడు. భరించలేక ఆమె హైదరాబాద్ కు వెళ్లిపోయింది. మూడేళ్ల తరువాత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన మరో మహిళతో మహేంద్రబాబు పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 

ఆమె నుంచి రూ.5 లక్షలు, ఆమె తల్లి ఫోన్ ద్వారా ప్రైవేట్ లోన్ యాప్ నుంచి రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు. మూడో పెళ్లి విషయం తెలిసిన రెండో భార్య అతని మీద, అతని తల్లి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దీని మీద దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాలు గురువారం తెలిపారు. 

కడప ట్రిపుల్ ఐటీలో ఇంటర్ విద్యార్ధి ఈశ్వర్ సూసైడ్

ఇదిలా ఉండగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్ళు, ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్ మురవణి నాలుగవ మైలురాయి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు, బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. హెచ్ మురవణి గ్రామానికి చెందిన ఉసేనీ కూతురు సుకన్య (24) గత ఏడాది డిసెంబర్ లో కాంట్రాక్టు పద్ధతిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓ( కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)గా విధుల్లో చేరింది.

అదే గ్రామానికి చెందిన పెద్ద ఈరన్న కుమారుడు వీరేశ్ (28)ను  ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణంలో వేరు కాపురం పెట్టారు. వీరేశ్ తన భార్యను రోజు ఉదయం ద్విచక్రవాహనంపై పనికి తీసుకువెళ్లి డ్యూటీకి వదిలిపెట్టి సాయంత్రం తీసుకుని వచ్చేవాడు. అందులో భాగంగా గురువారం సాయంత్రం తన భార్యను బైక్ పై తీసుకువస్తుండగా అమ్మాయి తండ్రి ఉసేని వారి బంధువులు హెచ్ మురవణి నాలుగో మైలురాయి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. 

దీంతో ఇద్దరూ కింద పడిపోవడంతో.. వీరేష్ పై విచక్షణారహితంగా దాడిచేశారు. చనిపోయాడని భావించి, అక్కడి నుంచి పారిపోయారు. సుకన్య ఈ దాడి చూసి భయంతో పరుగులు తీసింది. ఎమ్మిగనూరు రూరల్ పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీసులకు విషయం తెలిపింది. రహదారిలో వెళ్తున్న కొందరు ఇది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేయడంతోపాటు.. వీరేశ్ ను చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. బాధితుడి భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios