Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. పెళ్లై మూడేళ్లైనా పిల్లలు పుట్టలేదని.. భార్య కాలు,చేయి విరిచేసిన భర్త...!

పిల్లలు పుట్టలేదని భార్యను విచక్షణారహితంగా కొట్టి, కాలు,చేయి విరిచేశాడో కిరాతక భర్త. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 

husband brutally attacked on wife over not having kids in kurnool
Author
First Published Dec 28, 2022, 6:50 AM IST

కర్నూలు : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలకు సంతానం కలగకపోవడానికి భార్య ఒక్క దాన్నే తప్పుపట్టడం సమాజంలో అనాదిగా ఉన్న పరిస్థితి.  ఈ కారణంగానే మహిళలు అత్తింటి వారి వేధింపులు.. భర్త అఘాయిత్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతానం కలగకపోతే డాక్టర్లను సంప్రదిస్తారు.. బాబాలను నమ్ముతారు.. గుళ్లు, గోపురాలు తిరిగి పూజలు చేస్తారు…వీటిల్లో శాస్త్రీయతను పక్కనపెడితే ఎవరి నమ్మకాలు వాళ్లవిగా ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఓ వ్యక్తి మాత్రం సంతానం కలగలేదని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కాళ్లు, చేతులు విరిచేశాడు. ఈ ఘటన మంగళవారం కర్నూలు జిల్లా డోన్ మండలం చనుగొండ్లలో జరిగింది. ఈ విషయం తెలియడంతో హుటాహుటిన కూతురు ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులు.. అప్పటికే అపస్మారక స్థితిలో, తీవ్రగాయాలతో ఉన్న కూతురిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ఘటన మీద బాధితురాలి తల్లిదండ్రులు ఈ మేరకు వివరాలు తెలియజేశారు.

నరసరావుపేట వైసీపీలో వర్గపోరు : కాసు మహేశ్‌రెడ్డి అనుచరుల ఫ్లెక్సీలు.. శిలాఫలకం కూల్చేసిన ఎమ్మెల్యే వర్గీయులు

లాలప్ప, ఆదిలక్ష్మిలు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చందోలి గ్రామవాసులు. వీరి కూతురే బాధితురాలైన భవాని. ఆమెను  డోన్ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తికి ఇచ్చి  మూడేళ్ల కిందట పెళ్లి చేశారు. అయితే పెళ్లి అయిన నాటి నుంచి భవానికి వేధింపులు ఎదురవుతున్నాయి. ఈ మేరకు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం రాము, భవాని విచక్షణ రహితంగా కొట్టాడు. కాలుచేయి విరిచేశాడు అని ఆరోపించారు.

కూతురు పరిస్థితి ప్రమాదకరంగా వుందని.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని తమకు సమాచారం అందిందని.. దీంతో వెంటనే కూతురు ఇంటికి వెళ్ళామని చెప్పారు. అక్కడికి వెళ్లేసరికి ఆ పరిస్థితి చూసి తాము తట్టుకోలేకపోయామని వివరించారు. వెంటనే కూతురిని ఆటోలో పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ ఆమెకు ప్రథమ చికిత్స చేసిన తర్వాత పరిస్థితి విషమంగా ఉండటంతో.. హుటాహుటిన కర్నూలుకు తరలించామని చెప్పుకొచ్చారు. తమ కుమార్తె ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అయిన ఆమె భర్త రామును, అతని కుటుంబ సభ్యులను  వదిలి పెట్టొద్దని.. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 20న కేరళలోని తిరువనంతపురంలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆ వీడియోను పరిశీలించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన భార్యను దారుణంగా కొట్టి, వీడియో తీసిన 27 ఏళ్ల యువకుడిని దిలీప్ గా మలైంకీజు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేదని ఆమెను చిత్ర హింసలకు గురి చేశాడు. 

తిరువనంతపురం స్థానికుడైన దిలీప్ భార్య తన మాట వినకుండా సూపర్ మార్కెట్‌లో పనికి వెడుతుందని ఆమెను కొట్టాడు. వీడియోలో దిలీప్ తన భార్యను దారుణంగా కొడుతున్న సమయంలో  ‘అప్పు తీర్చాలంటే ఉద్యోగానికి వెళ్లాలి' అని దిలీప్ భార్య చెప్పడం వినపడుతోంది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన వీడియోలో మహిళ ముఖం రక్తసిక్తమైంది. దిలీప్ భార్య ఫిర్యాదు మేరకు మలయంకీజు పోలీసులు నిందితుడిని హత్యాయత్నం, అనేక ఇతర అభియోగాల కింద అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios