Asianet News TeluguAsianet News Telugu

కొడుకు ఎదుటే భర్తను తిడుతూ, కొడుతున్న భార్య.. తట్టుకోలేక ఆ భర్త చేసిన పని...

భార్య తిట్లతో విసిగిపోయిన భర్త ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు ఎవరో దుండగులు చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ చివరికి... 

husband assassinate wife for harassment in kadapa
Author
First Published Nov 28, 2022, 7:26 AM IST

కడప : భార్య తిట్లు భరించలేక విసుగుచెంది పథకం ప్రకారం ఆమెను హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు కడప గ్రామీణ సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు…‘పీకే దీన్నే మండలం ఇందిరానగర్ కు చెందిన నరసింహారావు లక్ష్మీదేవికి కొన్నేళ్ళ కిందట వివాహమయ్యింది. వీరికి ఇంటర్ చదువుతున్న కొడుకు ఉన్నాడు. నరసింహారావు కడపలో ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నాడు. ఎదిగిన కొడుకు ఎదుటి భార్య భర్తని తిడుతూ, కొడుతూ ఉండేది. 

దీంతో భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 23న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో నరసింహారావు భార్యను గట్టిగా తోయడంతో... ఆమె విసురుగా వెళ్లి వంటగదిలో ఉన్న పదునైన రాయిపైన పడింది. దీంతో లక్ష్మీదేవికి తీవ్ర గాయాలయ్యాయి. అదే అదనుగా అనుకున్న భర్త వెంటనే ఆమె గొంతు నొక్కాడు. బలంగా నేలకేసి కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా రోజులాగే మామూలుగా స్కూల్ కి వెళ్ళాడు. లక్ష్మీదేవి విగతజీవిగా నేలపై పడి ఉండడం చూసిన స్థానికులు నరసింహారావుకు సమాచారమిచ్చారు.

అరకు ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ప్రైవేటు బస్సు...24 మంది ప్రయాణికులు సురక్షితం..

దీంతో,  ఏమీ తెలియనట్టుగా.. తన భార్యను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని అందరిని నమ్మించాడు, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సాక్షులను విచారించగా… భార్య పెట్టే వేధింపులు భరించలేక భర్తనే హత్య చేశాడని తెలిసింది. అప్పటికే నరసింహారావు పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరికితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పీకే దీన్నే ఆర్ఐ ఎదుట లొంగిపోయిన నేరాన్ని అంగీకరించాడు’ అని సీఐ చెప్పారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశామని అన్నారు. సమావేశంలో ఎస్సైలు అరుణ్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, విష్ణు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios