నిజామాబాద్‌ జగ్గొరాలో వన్యప్రాణుల వేట కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.హైదరాబాద్ నుంచి రోజూ నిజామాబాద్‌‌‌కు వెళుతున్న ఓ ముఠా వన్యప్రాణులను వేటాడుతోంది.

లుక్మన్ అనే వ్యక్తి నిజామాబాద్‌లో రైస్ మిల్ నడుపుతున్నాడు. ఈ రైస్ మిల్ చాటున వన్యప్రాణుల వ్యాపారం చేస్తున్నాడు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు అధికారులు.

వేటగాళ్ల నుంచి భారీగా వన్యప్రాణుల మాంసం, పెద్ద ఎత్తున బుల్లెట్లు, తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మాంసాన్ని సీసీఎంబీకి తరలించారు. మరోవైపు హైదరాబాద్‌లోని వేటగాళ్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.