Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో తాంత్రిక పూజలు.. నట్టింట్లో తొమ్మిది అడుగుల గుంత, నరబలి..?

నెల్లూరు జిల్లాలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి.  కలిగిరి మండలం తూర్పుదూబగుంట ఎస్సీ  కాలనీకి చెందిన చదలవాడ మాల్యాద్రి కుటుంబం అర్థరాత్రి పూట పూజలు చేసి నరబలికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. 

human sacrifice in nellore  district
Author
Nellore, First Published Oct 1, 2018, 1:49 PM IST

నెల్లూరు జిల్లాలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి.  కలిగిరి మండలం తూర్పుదూబగుంట ఎస్సీ  కాలనీకి చెందిన చదలవాడ మాల్యాద్రి కుటుంబం అర్థరాత్రి పూట పూజలు చేసి నరబలికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

15 రోజుల క్రితం కందుకూరు నుంచి ఒక అర్థరాత్రి పూజలు చేసే వ్యక్తిని తీసుకుని వచ్చి.. పూజలు నిర్వహించారని గ్రామస్తులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో నాలుగు రోజుల పాటు తొమ్మిది అడుగుల లోతు గుంత తీసి పూజలు జరిపి మళ్లీ పూడ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే మాల్యాద్రి కుటుంబసభ్యులు మాత్రం కుటుంబపెద్దకి అనారోగ్యంగా వుండటం వల్ల కాటికాపరి సూచనల మేరకు ఇంట్లో తొమ్మిది అడుగుల లోతు తీసి పూజలు జరిపి దానిలో గుమ్మడికాయను పూడ్చి పెట్టామంటున్నారు.. అయితే జనం ఫిర్యాదుతో గ్రామానికి చేరుకున్న పోలీసులు మాల్యాద్రి ఇంట్లో పూడ్చిన తొమ్మిది అడుగుల గుంతను తవ్వి పరిశీలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios