ప్రత్యేక హోదా: విజయవాడలో కోటి మందితో మావనహారం

First Published 25, Jul 2018, 11:46 AM IST
Human chain in Vijayawada for special status to ap state
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మానవహారాన్ని నిర్వహించారు. ఏపీ రాష్ట్రానికి హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి.
 


విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మానవహారాన్ని నిర్వహించారు. ఏపీ రాష్ట్రానికి హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విజయవాడలో  కోటి మందితో మానవహరం నిర్వహించారు. ఈ మానవహారంలో  సీపీఐ, సీపీఎం నేతలుపాల్గొన్నారు.  ప్రత్యేక హోదా పోరాట సమితితో పాటు పలు ప్రజా సంఘాలు, విద్యార్ధి, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. 

విజయవాడ వేదికగా  మానవహరం నిర్వహించారు. మానవహరంలో పాల్గొన్న ప్రజా సంఘాల నేతలు, విపక్షాలు  పెద్ద ఎత్తున  బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఏపీకి ప్రత్యేక హోదా  ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని నేతలు ఆరోపించారు.

రాజ్యసభలో  స్వల్పకాలిక చర్చ సందర్భంగా  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు  చేసిన ప్రసంగంపై ప్రత్యేక హోదా  సాధన సమితి నేత చలసాని శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ నుండి బెంజిసర్కిల్ వరకు మానవహారాన్ని నిరసించారు.  అయితే  మానవహారంలో పాల్గొనేందుకు వచ్చే వారిని  పోలీసులు అడ్డుకొంటున్నారు. అయితే పోలీసులతో ఆందోళనకారులు  వాగ్వాదానికి దిగారు. 
 
 

loader