తిరుమల: అలిపిరి-తిరుమల కాలి మార్గంలో భారీ నాగు కలకలం సృష్టించింది.  అలిపిరి మార్గంలో నరసింహ స్వామి ఆలయం వద్దనున్న ఒక దుకాణంలో 7ఫీట్ల   కనిపించింది. 

అంతపెద్ద పామును చూడడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బుసలుకొడుతూ పాము ఆ దుకాణంలో కొద్దిసేపు కలకలం సృష్టించింది. 

షాపు యజమాని టీటీడీ అటవీశాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడుకు ఫోన్ చేసారు. గతంలో కూడా ఇలా పలుమార్లు పాములను పట్టుకొని అడవిలో విడిచిపెట్టారు. పాము ఉన్న దుకాణం దగ్గరకు చేరుకున్న భాస్కరనాయుడు పామును పట్టుకొవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.