ఏపీలోని అన్ని పంచాయతీలలో ప్రతి  50 కుటుంబాలకు  ఓ గ్రామ వాలంటీర్లను నియమిస్తామని సీఎం జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా... ఈ గ్రామ వాలంటీర్ల నిర్ణయానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇటీవల గ్రామ వాలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా... దానికి అప్లై చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపించారు. కేవలం ఆరు రోజుల్లో మూడు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
 
మరోవైపు వెబ్‌సైట్‌ను చూడటానికి వీక్షకులు పోటెత్తారు. ఇప్పటి వరకూ 11లక్షల మందికి పైగా గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌ను నెటిజ‌న్లు తిల‌కించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆలోచ‌నావిష్క‌ర‌ణ‌కు అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వస్తున్నాయి. దీనిని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 35ఏళ్ల వయసులోపు వారు దీనికి అర్హులు. జులై 5 వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.