గుంటూరు వాసులకు శుభవార్త: రూ.130 కోట్లతో పీవీకే నాయుడు కాంప్లెక్స్.. మంత్రి బొత్స ఆమోదం
గుంటూరు (guntur) వాసులకు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) శుభవార్త చెప్పారు. నగరంలో పీవీకే నాయుడు (pvk naidu market guntur) కాంప్లెక్స్ పేరిట భారీ వాణిజ్య సముదాయం త్వరలో రూపు దిద్దుకోనుంది.
గుంటూరు (guntur) వాసులకు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) శుభవార్త చెప్పారు. నగరంలో పీవీకే నాయుడు (pvk naidu market guntur) కాంప్లెక్స్ పేరిట భారీ వాణిజ్య సముదాయం త్వరలో రూపు దిద్దుకోనుంది. గతంలో పీవీకే నాయుడు మార్కెట్ ఉన్న స్థలంలోనే ఈ కొత్త కాంప్లెక్స్‌ను నగరపాలక సంస్థ (guntur municipal corporation) నిర్మించనుంది. దీని అంచనా వ్యయం రూ.130 కోట్లు. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆమోదం తెలిపారు. గుంటూరు నగరంలో పీవీకే నాయుడు మార్కెట్ ఎంతో ప్రసిద్ధికెక్కింది.
కాగా.. పీవీకే నాయుడు 1945లో గుంటూరు నగరపాలక సంస్థలకు 60 సెంట్ల భూమిని ఇవ్వగా, అందులో దుకాణాలు నిర్మించి వ్యాపారస్తులకు అద్దెకు ఇచ్చారు అధికారులు . దాదాపు 70 ఏళ్ల పాటు సేవలు అందించిన ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో ఆరేళ్ల కిందట అధికారులు దానిని కూలగొట్టారు. దీంతో ఇక్కడ నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి ఏపీ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ (ap urban infrastructure asset management limited) ప్రతినిధులు పీవీకే నాయుడు మార్కెట్ కాంప్లెక్స్‌కు డిజైన్లు రూపొందించారు.
11 శ్లాబులు, ఒక్కో ఫ్లోర్ 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉండేలా ప్లాన్ రూపొందించారు. ఇందులో వ్యాపారస్తులకు రెండు ఫ్లోర్లు, మిగతా ఫ్లోర్లను గుంటూరు కార్పొరేషన్ ఆఫీసు, ఇతర వాణిజ్య సంస్థలకు కేటాయించనున్నారు.
ALso Read:టీడీపీ హయాంలోనే అప్పులన్నీ...చంద్రబాబుని ప్రశ్నించండి.. బొత్స
మరోవైపు కేంద్ర ప్రభుత్వం బాటలో ఏపీ సర్కార్ నడుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల మోనటైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మిషన్ బిల్డ్ ఏపీలో (mission build ap) భాగంగా విజయవాడలోని (vijayawada) స్టేట్ గెస్ట్‌హౌస్ (state guest house) ప్రాంగణాన్ని కమర్షియల్ డెవలప్‌మెంట్ కోసం అప్పగించింది. డెవలప్‌మెంట్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అలాగే మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను రుద్రాభిషేక్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌కు (rudrabhishek enterprises ltd) అప్పగించింది. మొత్తం 3.26 ఎకరాల్లో విస్తరించి వుంది స్టేట్ గెస్ట్ హౌస్. లక్ష చదరపు మీటర్లలో స్టేట్ గెస్ట్ హౌస్ పున: నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం.