ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేయడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోం పేజీలో ఏపీ సప్లి ఫలితాల లింక్‌ను క్లిక్ చేయాలి. అక్కడ హాల్ టికెట్ ఇతర వివరాలను ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లి ఫలితాలు నేడు విడుదల అవుతున్నాయి. ఈ ఫలితాలను bse.ap.gov.in వెబ్‌సైట్‌లో విడుదల అవుతాయి. వీటిని విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్లు, ఇతర వివరాలు ఎంటర్ చేసి తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

జులై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పదో తరగతి సప్లి పరీక్షలను విద్యార్థులు రాశారు. 2,01,627 మంది విద్యార్థులు AP 10th Supplementary పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలు ఫలితాలు ఆగస్టు 3వ తేదీకి ఉదయం 10.00 గంటలకు విడుదల చేస్తామని ఇది వరకే అధికారులు చెప్పారు.

ఈ ఫలితాలను manabadi.com, bse.ap.gov.in, bie.ap.gov.in వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు.

ఈ ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ పాటించండి. 

ముందు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.inకు వెళ్లాలి. అక్కడ హోమ్ పేజీలో AP SSC Supply Result 2022 లింక్‌ క్లిక్ చేయాలి. అనంతరం, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడే ఉన్న రిజల్ట్ బటన్ క్లిక్ చేయాలి. వెంటనే సప్లిమెంటరీ ఫలితాలు డిస్‌ప్లేపై కనిపిస్తాయి. వాటిని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోవాలి.