Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఆ పార్టీకే అధిక సీట్లు.. తేల్చి చెప్పిన తాజా సర్వే..

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే విషయంలో ఓ మీడియా సంస్థ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. తాజాగా వాటిని విడుదల చేసింది.

How many seats will a party get in AP? What do the latest survey results say?..ISR
Author
First Published Mar 19, 2024, 10:47 AM IST

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం సరిగ్గా నెల రోజుల ఏపీలో తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి.  

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్టీఏ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. అధికార వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల నేతృత్వంలో మొదటి సారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే ఆ పార్టీ పలు హామీలను ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 

కాగా.. ఏపీలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఇప్పటికే పలు సర్వే సంస్థలు అంచనాలను వెల్లడించాయి. తాజాగా ‘బిగ్ టీవీ’ కూడా ఇలాంటి సర్వే జరిపి, ఫలితాలను విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందే ఈ సంస్థ ఏపీలో సర్వే మొదలుపెట్టింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాబట్టి ఈ ఎన్నికల సర్వేలో కాంగ్రెస్ పార్టీ చూపే ప్రభావంపై అభిప్రాయాలు తీసుకోలేదు. 

ప్రధానంగా ఈ సర్వే వైసీపీతో పోలిస్తే ఎన్డీఏ కూటమికి అధిక స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎన్డీఏ కూటమి మొదటి స్థానంలో, వైసీపీ రెండో స్థానంలో నిలుస్తుందని, కొన్ని స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని వెల్లడించింది. మొత్తంగా ఏపీలో ఉన్న మూడు ప్రాంతాలను ఆధారంగా సర్వే ఫలితాలను ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని పది స్థానాల్లో ఎన్డీఏ కూటమి 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. వైసీపీ 3 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. అయితే 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని సర్వే అంచనా వేసింది. 

అలాగే విజయనగరం జిల్లాలో 9 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 4, వైసీపీకి 4 స్థానాలు వస్తాయని, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని పేర్కొంది. విశాఖపట్నంలో 15 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 7, వైసీపీకి 5 సీట్లు వస్తాయని 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపింది. కోస్తాంధ్రలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 19 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 7, వైసీపీకి 5 వస్తాయని, 7 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని వెల్లడించింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 9, వైసీపీకి 2, 4 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని పేర్కొంది. కృష్ణా జిల్లాని 16 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 9, వైసీపీకి 4, 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని సర్వే అంచనా వేసింది.

గుంటూరు జిల్లాలోని 17 సీట్లలో ఎన్డీఏ కూటమికి 11, వైసీపీకి 2 సీట్లు వస్తాయని 4 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని సర్వే వెల్లడించింది. ప్రకాశం జిల్లాలోని 12 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 6, వైసీపీకి 3, 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని పేర్కొంది. నెల్లూరు జిల్లాలోని 10 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 4, వైసీపీకి 4, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని వెల్లడించింది. అలాగే చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 7, వైసీపీకి 6, 1 స్థానంలో టఫ్ ఫైట్ ఉంటుందని సర్వే చెప్పింది. కడప జిల్లాలోని 10 సీట్లలో ఎన్డీఏ కూటమికి 2, వైసీపీకి 4, 4 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపింది. 

కర్నూలు జిల్లాలోని 14 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 4, వైసీపీకి 8, 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని పేర్కొంది. అనంతపురం జిల్లాలో ఉన్న 14 సీట్లలో ఎన్డీఏ కూటమికి 6, వైసీపీకి 6, 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని సర్వే అంచనా వేసింది. మొత్తంగా ఏపీలో ఉన్న 175 స్థానాల్లో ఎన్డీఏ కూటమి 81 స్థానాలు కైవసం చేసుకుంటుందని, వైసీపీ 53 స్థానాల్లో గెలుస్తుందని, 41 స్థానాల్లో టఫ్ ఫైట్ జరుగుతుందని సర్వే అంచనా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios