ఒడిస్సాను కాదని కేంద్రం ఇపుడు ఏమీ చేసే పరిస్ధితుల్లో లేదు. అదే సమయంలో చంద్రబాబు మాట కేంద్రంలో చెల్లుబాటు కావటం లేదు.

ఇంతకాలం జనాలను మోసం చేసింది వెంకయ్యకు చాల్లేదేమో. రాష్ట్ర విభజన జరిగి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేంద్రమంత్రి వెంకయ్యనాయడు ప్రతీ విషయంలోనూ పచ్చిగా బొంకుతూనే ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్కేకహోదాతో మొదలు పెట్టి విశాఖ రైల్వే జోన్ వరకూ వెంకయ్య బొంకులు అన్నీ ఇన్నీ కావు. ఇంకా ఎంతకాలం బొంకుతారో తెలీదు.

ఇంతకీ విషయమేమిటంటే, విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి వెంకయ్య తదితరులు హాజరయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖపట్నంకు రైల్వేజోన్ మంజూరవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. విశాఖకు రైల్వేజోన్ వచ్చేది లేదన్న విషయం అందరికీ తెలుసు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు కుదరదని రైల్వే బోర్డు ఎప్పుడో తేల్చేసింది.

కొత్త ప్రాజెక్టులు గావచ్చు, పొడిగింపు కావచ్చు, జోన్ల ఏర్పాటు ఇలా..ఏది ఏర్పాటవ్వాలన్నా రైల్వే బోర్డు నిర్ణయమే ఫైనల్. రైల్వేబోర్డును కాదని కేంద్రం ఏమీ చేయలేందు. అటువంటి బోర్డే విశాఖకు ప్రత్యేకరైల్వే జోన్ సాధ్యం కాదని తేల్చేసింది. ఎందుకంటే, విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుకు ఈస్టర్న్ రైల్వేజోన్ అంగీకరించటం లేదు.

ఒడిస్సాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ రైల్వేజోన్ ఆదాయం మొత్తం విశాఖపట్నం నుండే వస్తోంది. అటువంటిది విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పడితే భువనేశ్వర్ నష్టాల్లో పడిపోతుంది. ఎవరు మాత్రం ఆదాయాన్ని కోల్పోవటానికి ఒప్పుకుంటారు? అందుకనే ఒడిస్సా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

ఒడిస్సాను కాదని కేంద్రం ఇపుడు ఏమీ చేసే పరిస్ధితుల్లో లేదు. అదే సమయంలో చంద్రబాబు మాట కేంద్రంలో చెల్లుబాటు కావటం లేదు. కాబట్టే కేంద్రం ప్రతీ విషయంలోనూ రాష్ట్రాన్ని పక్కన పెట్టేస్తోంది . ఈ విషయాలు కొత్తవీ కావు, ఎవరికీ తెలీనివీ కావు. గడచిన రెండున్నర సంవత్సరాల్లో అటు వెంకయ్యనాయడు, ఇటు చంద్రబాబునాయుడులు చేస్తున్న విన్యాసాలను అందరూ కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నారు.

మొదట రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులన్నారు. ఏదీ, ఇంతవరకూ ఎంత ఇచ్చారు? ప్రత్యేకహోదా ఇచ్చే విషయాన్ని మోడి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు వందలసార్లు వెంకయ్య, సుజనా చౌదరిలు చెప్పారు. వెంకయ్య అయితే హోదా సాధించేసినట్లు ఏకంగా సన్మానాలే చేయించుకున్నారు. చివరకి ఏమైంది?

ఇపుడు విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్ అంశం కూడా అంతే. ఏదో సమావేశానికి హాజరయ్యామా, వెళ్ళిపోయామా అన్నట్లు కాకుండా నోటికి వచ్చినట్లు చెప్పేసి ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించటం వెంకయ్యకు మామూలైపోయింది. రెండున్నరేళ్ళయిన తర్వాత కూడా జనాలు ఇంకా వెంకయ్య మాటలు నమ్మేస్ధితిలో ఉన్నారా?