Asianet News TeluguAsianet News Telugu

కియా మోటార్స్ ని ఆంధ్రా వైపు ఎలా మళ్లించారు

కియా మోటార్స్ మొదట వెళ్లింది తమిళనాడుకు. అయితే, అక్కడరాజకీయ నాయకులు భారీగా ఆమ్యామ్యా డిమాండ్ చేయడంతో వాళ్లు ప్రత్యామ్నయం వెదుక్కోవలసి వచ్చింది. ఆసమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్రం తప్పి, అడిగినవే కాకుండా ఇంకా వసతులు ఆఫర్ చేసి కరువు జిల్లా అనంతపురం లోని పెనుగొండలో ఫ్యాక్టరీ పెట్టేలా వప్పించాడని కియో కన్సల్టెంట్ కన్నన్ రామసామి తన ఫేస్ బుక్ లో రాసుకున్నారు.

how kia withdrew from tamil nadu in favor of Andhra Pradesh

దక్షిణ కొరియా ఆటో దిగ్గజం "కియా మోటార్స్" అనంతపురం జిల్లాలోని పెనుగొండ వద్ద  ప్లాంట్ పెడుతుందనే మనకు తెలుసు.  2019 చివరకల్లా అక్కడి నుంచి కియా లియో సెడాన్ కారు (ఫోటో) ఉత్పత్తవుందుని కూడా  తెలుసు. ఈ కంపెనీ ఈ కారు ఆంధ్ర వైపు మళ్లడానికి  వెనక చాలా కథ నడిచింది. ఈ విషయాన్ని తమిళనాడు కు చెందిన కన్నన్ రామస్వామి అనే పారిశ్రామిక వేత్త బయటపెట్టాడు. లియా కార్ల కంపెనీ హ్యుందాయ్ కి అనుబంధ సంస్థ . వారు రెండేళ్లుగా భారత్ వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, భారత్ లో ఏ రాష్ట్రానికి వెళ్లాలి? అనే సమస్య వచ్చింది. అపుడు కన్నన్ వారికి సహాయం చేశాడు, తమిళనాడు వైపు మళ్లించాడు. అయితే కథ చివరకు పెనుగొండలో ఎలా ముగిసిందో కన్ననే వివరించాడు.  

 

కన్నన్ రామసామి తిరుచ్చి నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ లో బిటెక్ చదివారు. ప్రస్తుతం ఇన్ ఫ్రాటెక్ ఇన్ ఫ్రాస్ట్రక్చ ర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు.

 

ఆయన తన పేస్ బుక్ పోస్టు లో రాసిన విషయాలివి:                                                                                                                                                                   

 

"నేను ఈ పోస్టును హృదయంలో ఎంతో  బాధపడుతూ రాస్తున్నాను.  పరిస్థితి ఇలాగే కొనసాగితే తమిళనాడు ఎటు పోతుందోనని నేను నిజంగా భయపడుతున్నాను.

 

దక్షిణ కొరియా దేశానికి చెందిన ఆటోమొబైల్ సంస్థ "కియా మోటార్స్" (ఇది దక్షిణ కొరియా హ్యుందాయ్ కంపెనీ' సబ్సిడియరీ) భారతదేశములో తన బ్రాండ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్.యు.వి.లు)/ సెడాన్లు తయారు చెయ్యటానికి ప్లాంట్ నెలకొల్పాలనుకుంది.  

 

ఆ కంపెనీ'కి సంబంధించి స్థానిక సలహాదారులుగా మేము  విశ్లేషణాత్మకంగా, లోతైన సర్వే చేసి మొదటి ఛాయస్ గా తమిళనాడు రాష్ట్రాన్ని, రెండో ఛాయస్ గా గుజరాత్ రాష్ట్రాన్ని, మూడో ఛాయస్ గా శ్రీ సిటీ (ఆంధ్ర ప్రదేశ్) ను ప్రతిపాదించాము.

 

కియా మోటార్స్ ప్రతినిధులు తమిళనాడు పరిశ్రమల శాఖ కార్యదర్శితో పాటు సిప్కాట్ నుసంప్రదించారు.  ఒర్గాదం కాంప్లెక్స్ దగ్గిర ఫ్యాక్టరీ కి అసవరసమయిన భూములు సిప్కాట్ దగ్గిర ఉన్నాయి.

 

అయితే, తమిళనాడు రాజకీయ నాయకులు భూములకు ప్రభుత్వం నిర్ణయించిన  ధరకంటే 50 శాతంఎక్కువ లంచం అడిగారు.

 

కియా మోటార్స్ వారు భూమితో పాటు, టాక్స్ హాలిడే, పవర్ సబ్సిడీ, మౌలిక సదుపాయాలు (రోడ్లు, నీరు, డ్రైనేజీ, సింగల్ విండో క్లీరెన్సులు) కావాలని అడిగారు.

 

అయితే, ఈ భూములందిస్తున్నందుకు వారు చాలా పెద్ద మొత్తం లంచం కోరుతున్నారు.

 

ఫ్యాక్టరీతో పాటు  70 రకాల అనుబంధపరిశ్రమలను కూడా ఏర్పాటుచేస్తామన్నాం. ఇందులో కొన్ని భారత్ వి, మరికొన్ని దక్షిణ కొరియావి. కియాకు విడిభాగాలు సరఫరా చేసే ఈ యూనిట్లన్నీ పక్కనే వస్తాయి. కియా ప్లాంట్ సిద్ధమయ్యేనాటికి ఈ అన్సెల్లరీ యూనిట్లు వాటి వాటి విభాగాల్లో రెడీగా ఉండాలి అనేది ఉద్దేశం.

 

దురదృష్ట వశాత్తు, కియా యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలని నిర్ణయించింది. అది కూడా శ్రీ సిటికి కాదు. బాగా వర్షాభావ ప్రాంతం, అభివృద్ధికి నోచుకోని అనంతపురం జిల్లాకు వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు.

 

అనంతపురానికి వస్తే కియా ప్లాంట్ పెట్టించటానికి  చాలా రాయతీలు కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని వప్పించారు.

 

కియా మోటార్స్ ప్లాంట్ ను బెంగళూరు-ముంబై రహదారికి/ బెంగళూరు-హైదరాబాద్ రహదారికి అనుసంధానించటానికి 200 ఫీట్ హైవే రోడ్ వేస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

 

కియా మోటార్స్ తమిళనాడు లో ప్లాంట్ పెట్టేలా ఒప్పించటానికి మా కన్సల్టింగ్ టీం దాదాపు రెండు సంవత్సరాలు ఎంతో శ్రమించింది.  తమిళనాడు లో ఉన్న హ్యుందాయ్ బృందం కూడా మాకు అన్ని రకాలుగా సహకారం అందించింది.

 

ఇదే పద్ధతి తమిళనాడు కొనసాగిస్తే, ఈ రాష్ట్రం వెనక బెంచీల్లో కూర్చోవలసి వస్తుంది.

 

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ప్రతిపాదనకు నేను వ్యతిరేకత చెప్పినా, ఆరునెలలపాటు రాష్ట్రపతి పాలన విధించం ఇక్కడ బాగా ముదిరిన అవినీతి రోగానికి  ఒక చేదు మాత్రలా పనిచేస్తుందని ఇపుడు భావిస్తున్నాను.

 

ఇప్పుడు కియా మోటార్స్ ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లిపోవటంతో కియా ప్లాంట్ ద్వారా తమిళనాడు కు రావాల్సిన 1. 1 బిలియన్ డాలర్స్ పెట్టుబడులే కాకుండా... కియా వాళ్లు చెప్పిన  70 కంటే అన్సెల్లరీ యూనిట్స్ తమిళనాడు కోల్పోయింది.

 

అంతకంటే ముఖ్యంగా తమిళనాడురాష్ట్ర యువకులకు, వృద్ధి విద్యా నిపుణులకు భారీ ఉద్యోగావకాశాలు చేజారాయి.

 

సిగ్గుతో  నేనే తలవంచుకుంటున్నాను ...."

 

Follow Us:
Download App:
  • android
  • ios