వేలమంది లబ్దిపొందిన తర్వాత లబ్దిదారుల కుటుంబాల్లోని 40 వేల ఓట్లైనా టిడిపికి పడవా అని టిడిపి అనుకున్నది. ఒకేసారి వేల ఓట్లు పడితే టిడిపిదే భారీ విజయమని అంచనా వేసింది. అయితే, ఇక్కడే టిడిపికి ఊహించని షాక్ తగిలింది. ఎలాగంటే, వేలాది దరఖాస్తులు వచ్చేస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తే వచ్చిన దరఖాస్తులు సుమారు 1100 మాత్రమే.
నంద్యాల ఉపఎన్నికలో ఎంతో ఆశలు పెట్టుకున్న హౌసింగ్ స్కీం టిడిపిని దెబ్బకొట్టేట్లుంది. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం క్రింద ప్రతీ పట్టణానికీ 13 వేల ఇళ్ళు మంజూరయ్యాయి. అందులో భాగంగానే నంద్యాలకు కూడా 13 వేల ఇళ్ళు వచ్చాయి. పథకాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబునాయుడు హడావుడి చూసేస్తున్నారు. ఉపఎన్నికలో ఒకేసారి వేలాదిఇళ్ళను నిర్మించేసి లబ్ది పొందేద్దామని చంద్రబాబునాయుడు ఆశపడ్డారు. అన్ని వేల ఇళ్ళను రాష్ట్రప్రభుత్వమే నర్మిస్తున్నట్లు పదే పదే ప్రకటించారు. దానికి భూమా నాగిరెడ్డి సెంటిమెంటును కూడా అద్దింది. వెంటనే లబ్దిదారుల నుండి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.
అయితే, ఇక్కడే చంద్రబాబు వ్యూహం తేడా కొట్టేసింది. లబ్దిదారుల నుండి దరఖాస్తులను ఆహ్వానించి వచ్చిన వాటిల్లోనుండి 13 వేలమంది లబ్దిదారులను ఎంపిక చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఒకపారి అన్ని వేలమంది లబ్దిపొందిన తర్వాత లబ్దిదారుల కుటుంబాల్లోని 40 వేల ఓట్లైనా టిడిపికి పడవా అని టిడిపి అనుకున్నది. ఒకేసారి వేల ఓట్లు పడితే టిడిపిదే భారీ విజయమని అంచనా వేసింది. అయితే, ఇక్కడే టిడిపికి ఊహించని షాక్ తగిలింది. ఎలాగంటే, వేలాది దరఖాస్తులు వచ్చేస్తాయని అంచనా వేసింది ప్రభుత్వం. తీరాచూస్తే వచ్చిన దరఖాస్తులు సుమారు 1100 మాత్రమే.
అధికారులు ఇచ్చిన సమాచారంతో టిడిపి నేతలకు కళ్ళుబైర్లు కమ్మాయట. ఏదో ఊహించుకుంటే ఇంకేదో అవ్వటంతో టిడిపి నేతలు ఖంగుతిన్నారు. కారణమేంటని ఆరా తీస్తే అసలు విషయం బయపడింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నిర్మించాల్సిన ఇళ్ళను మూడు రకాలు. ఎల్ఐజి (లోయర్ ఇన్ కమ్ గ్రూప్) క్రింద జి+1 వర్గీకరణలో ఇంటిని 645 చదరపు గజాల్లో నిర్మించాలి. ఇందుకోసం లభించే రూ. 6 లక్షలు రుణంలో రూ. 2.67 లక్షల సబ్సిడీ.
అదేవిధంగా, ఎంఐజి-1 ఇంటికి రూ. 9 లక్షలు రుణమైతే రూ. 2.35 లక్షలు సబ్సిడి. ఇక, ఎంఐజి-2 క్రింద రూ. 12 లక్షల రుణం వస్తుంది. అందులో రూ. 2.3 లక్షల సబ్సిడీ లభిస్తుంది. అయితే, కేంద్రం నిర్ణయించిన ధరలే నంద్యాల జనాలకు నచ్చలేదు. దేశంమొత్తం మీద పట్టణ ప్రాంతాల్లోని ధరలను విచారించి సగటు ధరను కేంద్రం నిర్ణయించింది. అయితే, కేంద్రం నిర్ణయించిన సగటు ధర కూడా నంద్యాల జనాలకు చాలా ఎక్కువగా అనిపించింది. అందుకే నంద్యాల జనాలు ఈ స్కీం విషయంలో ఆశక్తి చూపలేదు. దాంతో టిడిపి నేతలకు ఇపుడేం చేయాలో దిక్కుతోచటం లేదు.
