అసహజ శృంగారం: సెక్స్‌కు నో చెప్పాడని స్నేహితుడి మర్డర్, ఆత్మహత్య

hours After killed Prabhu, Saravan commits Suicide in Tamilnadu
Highlights

సెక్స్‌కు ఒప్పుకోనందుకు మర్డర్

చెన్నై: స్వలింగ సంపర్కానికి నిరాకరించిన స్నేహితుడిని  చంపి తాను కూడ ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి ఉదంతం ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో చోటు చేసుకొంది.

చెన్నై పార్క్‌ ప్రాంతానికి చెందిన జలకేష్‌కుమార్‌ అన్నాసాలై రిచ్‌ వీధిలో ఎలక్ట్రిక్‌ దుకాణం నడుపుతున్నాడు. ఇతని దుకాణంలో చింతాద్రిపేటకి చెందిన శరవణన్‌ , గోవిందన్‌ వీధికి చెందిన ప్రభు పని చేస్తున్నారు. 


వీరిద్దరూ స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డారు. ఈ విషయం ప్రభు ఇంట్లో తెలిసి అతడిని కుటుంబసభ్యులు మందలించారు.  కుటుంబసభ్యులు మందలించిన తర్వాత  ప్రభు ప్రవర్తనలో మార్పు వచ్చింది.  శరవణన్‌ను ప్రభు దూరం పెట్టాడు.  ఈ క్రమంలో దుకాణం వద్ద తనను కలవాలని ప్రభును శరవణన్‌ బతిమాలాడు. దీంతో ప్రభు ఆదివారం రాత్రి దుకాణం వద్దకు వెళ్లాడు.


రాత్రి పూట దుకాణం వద్దకు వచ్చిన ప్రభుని తనతో స్వలింగ సంపర్కానికి శరవణన్ ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే ప్రభు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఆవేశానికి లోనైన శరవణన్ ప్రభు గొంతు కోసి చంపేశాడు. అయితే ప్రభును చంపడంతో భయాందోళనలకు గురైన శరవణన్ కూడ  తాను కూడ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆయన చెప్పారు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   
 

loader