శ్రీకాకుళంలో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు నిందితుడిని చితకబాదారు.
ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో మూడో తరగతి చదివే చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలానికి చెందిన 8 సంవత్సరాల బాలిక స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. అయితే ఈ క్రమంలో శ్రీకాకుళం రూరల్ మండలంకు చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి ఆ గ్రామానికి చేరుకున్నాడు. మధ్యాహ్నం సమయంలో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండటాన్ని అతడు గమనించాడు. ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కొంత సమయం తరువాత బాలిక తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నారు. కుమార్తెకు రక్తస్రావం కావడాన్ని గమనించారు. ఏం జరిగిందని ఆరా తీశారు. అనంతరం నిందితుడిని చితకబాదారు. బాలికను ట్రీట్ మెంట్ కోసం శ్రీకాకుళంలోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఇదే సమయంలో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం బాధితురాలికి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఐదేళ్ల బాలికపై 19 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన గత నెల 5వ తేదీన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. వంజరవాడకు చెందిన నిందితుడు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బాలికను తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే బాలిక తనపై జరిగిన లైంగికదాడిని గురించి తన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబం పోలీసు స్టేషన్ కు వెళ్లి ఈ విషయంలో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్స్) నిబంధనల ప్రకారం 19 ఏళ్ల బాలుడిపై అత్యాచారం, ఇతర నేరాల కింద అభియోగాలు మోపారు.
ముంబయిలోని ఓ పాఠశాలలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 3 ఏళ్ల బాలికపై పాఠశాల ఆవరణలోనే ఇద్దరు తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు. ముంబయి పోలీసులు శుక్రవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముంబయిలోని మాతుంగా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. నిందితులు మైనర్ బాలురు బాలిక క్లాస్ మేట్స్, వారంతా కూడా 8వ తరగతి చదువుతున్నారని సమాచారం. తోటి క్లాస్ మేట్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు బాలికపై ఆమె ఇద్దరు క్లాస్ మేట్స్ లైంగిక దాడికి పాల్పడ్డారని మాతుంగా పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటను గురించి బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలుపడంతో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (డి), పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని డోంగ్రి కరెక్షనల్ హోమ్ (జువెనైల్ హోమ్) కు పంపారు.
