అనంతపురం జిల్లాలో యువతి పరువు హత్య.. చున్నీతో ఉరివేసి...
తాము చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని కుటుంబసభ్యులు ఓ యువతిని అతి దారుణంగా హత్య చేశారు.
అనంతపురం : తనకిష్టమైనవాడిని పెళ్లి చేసుకుంటానన్నందుకు ఓ యువతిని కుటుంబ సభ్యులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంకలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యువతికి కుటుంబసభ్యులు సంబంధం చూశారు. అయితే, యువతి మాత్రం తనకిష్టమైన వాడినే పెళ్లి చేసుకుంటానని.. తల్లిదండ్రులు చూసిన వాడిని చేసుకోనని మొండిపట్టు పట్టింది. దీంతో కోపానికి వచ్చిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.