Asianet News TeluguAsianet News Telugu

ప్రతిపక్షాలు సలహాలిస్తే స్వీకరిస్తాం... కానీ ఇది పద్దతి కాదు: హోంమంత్రి సుచరిత

మహిళ రక్షణ కోసం ఏర్పాటుచేసిన దిశ పోలీస్ స్టేషన్ల ముందు ప్రతిపక్ష టిడిపి నాయకులు ధర్నాకు దిగడంపై హోంమంత్రి సుచరిత సీరియస్ అయ్యారు. 

home minister sucharitha serious on tdp leaders protest in front of disha stations
Author
Amaravati, First Published Sep 2, 2021, 4:39 PM IST | Last Updated Sep 2, 2021, 4:39 PM IST

గుంటూరు: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాజకీయ లబ్ది కోసమే దిశ చట్టాన్ని అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. గత టిడిపి ప్రభుత్వంలో మహిళా తహశీల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేసినా పట్టించుకోలేదని... కానీ మా ప్రభుత్వంలో అనేక మంది సామాన్య మహిళలు దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారని హోంమంత్రి పేర్కొన్నారు. 

''మహిళ భద్రత కోసం చిత్తశుద్ధితో దిశ చట్టాన్ని తీసుకొచ్చాము. దిశ చట్టం రాష్ట్రపతి అనుమతి పొందే సమయానికల్లా మరింత పటిష్టంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇలాంటి సమయంలో కొంతమంది దిశ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేయడం బాధాకరం'' అని హోమంత్రి అన్నారు. 

వీడియో

''మహిళలపై ఏదైనా ఘటన జరిగితే పోలీసులు ఏడు రోజుల్లోనే ఛార్జ్ షీట్ వేస్తున్నారు. దాదాపు 1500 కేసుల్లో ఇలా 7 రోజుల్లోనే ఛార్జిషీటు వేశాం. దిశా చట్టం అమల్లోకి రాలేదు.. కానీ ఆ చట్టం స్పూర్తితో ఇప్పటికే పని చేస్తున్నాం'' అని అన్నారు. 

''రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రతిపక్ష పార్టీలు సలహాలిస్తే తప్పకుండా స్వీకరిస్తాం. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన వెంటనే దిశ చట్టాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. మంచి ఉద్దేశంతో తీసుకువచ్చిన దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దు'' అని సూచించారు. 

''మహిళల రక్షణ కోసం వైసిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. కానీ రాష్ట్రంలో ఏదైనా జరగకూడని ఘటన జరగగానే దాన్ని మానవతా దృక్పథంతో చూడకుండా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు'' అంటూ టిడిపి నాయకులపై హోమంత్రి సుచరిత మండిపడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios