Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల నుంచి తప్పుకుందామనుకున్నా..కానీ..: కన్నీటిపర్యంతమైన హోంమంత్రి సుచరిత (వీడియో)

దివంగత సీఎం వైఎస్సార్‌ మరణం తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికీ తీరనిలోటేనని హోంమంత్రి సుచరిత అన్నారు.

home minister mekathoti sucharitha emotion on ysr vardanthi
Author
Guntur, First Published Sep 2, 2020, 12:20 PM IST

గుంటూరు:మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా హోంమినిస్టర్‌ మేకతోటి సుచరిత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. వైఎస్సార్‌ మరణం తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికీ తీరనిలోటేనని సుచరిత అన్నారు. వైఎస్సార్ తో తనకున్న అనుబంధాన్ని హోం మినిస్టర్‌ గుర్తుచేసుకున్నారు. 

వైఎస్సార్‌ విజనరీ..పేదవాళ్లకు వరం...!

ఆయన సుధీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసి చలించిపోయారు. ముఖ్యంగా రైతు సోదరులు ఏడేళ్ల కరువు కాటకాలతో దుర్భిక్షం అనుభవిస్తుండటం చూసి అన్నదాతకు అండగా ఉండేందుకు ఏం చేయాలని ఆలోచించేవారు. ఆ మహనీయుడి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే రైతులకు ఉచిత విద్యుత్‌. వైఎస్సార్‌ పాదయాత్ర అన్నదాతలకు ఆశాజ్యోతిలా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రైతులకు సాగునీరుకు లోటు లేకుండా ఉండాలని...సాగునీరు సకాలంలో అందించగలిగితే వాళ్లు క్షేమంగా ఉంటారని జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. వాళ్లు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధరలు ఉండేలా చర్యలు తీసుకోవడం..ఆయనో రైతు పక్షపాతిలా ఆలోచించేవాడనడానికి నిదర్శనం.  అంతేకాకుండా అప్పటివరకు ఉన్నటువంటి అరకొర సంక్షేమ పథకాలు కూడా కొద్దిమందికి మాత్రమే అందడం చూసి....ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందించేలా పారదర్శక పాలన చేశారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందాలని ఒక విజనరీతో ఆలోచించినటువంటి మొట్టమొదటి నాయకుడు వైఎస్సార్‌.

ఈ రోజు సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటే అది వైఎస్ఆర్ ఆలోచనా విధానమే...!  

వైఎస్ఆర్‌ అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేనన్ని సంక్షేమపథకాలను అమలు చేశారు. అప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఆరోగ్యశ్రీ లాంటి మహోన్నత పథకానికి రాజశేఖర్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. అలాగే ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ద్వారా ప్రతి పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదవాలనే ఒక ఆలోచన చేసిన గొప్ప వ్యక్తిత్వం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారిదే. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో పేదవాడు సైతం ధైర్యంగా కార్పోరేట్‌ వైద్యం చేయించుకోగలిగారు. లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో మంచి చదువులు చదువుకోగలిగారు. సొంత ఇళ్లు లేని పేద మహిళలకు పక్కా ఇళ్లు కట్టింటి ఇచ్చారు. రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్లంతా సంక్షేమ ఫలాలు పొందగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షేమం అంటే వైఎస్ఆర్‌ పాలనకు ముందు తర్వాత అనేంతగా ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకున్నారు. దాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా దలారి వ్యవస్థ లేకుండా, అవినీతికి తావులేకుండా అర్హత ఉన్న ప్రజలకు నేరుగా వారి గుమ్మం ముందుకే సంక్షేమ పథకాలను తీసుకెళ్లారు. తండ్రి చూపిన బాటలో సంక్షేమ పాలన చేస్తూ ఈ రోజు భారతదేశంలోనే పేరెన్నిక గన్న ముఖ్యమంత్రుల్లో మూడవ స్థానంలో నిలిచారు. ఇప్పటికే దాదాపు 60 వేల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లోకి నేరుగా జమచేశారు. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా బలపడేలా ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించగా..ఈ రోజు తండ్రి అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వాళ్లను ఇంకో స్థాయి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని ప్రతి మహిళ ఆర్థికంగా స్థిరపడి ఆర్థిక మూలాలను బలోపేతం చేస్తే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ మహానుభావుడు కలలు కన్నటువంటి సంక్షేమ రాజ్యం త్వరలోనే సాకారమవుతుందని ఆశిస్తున్నా.

read more  వైఎస్సార్ వర్థంతి...కుటుంబంతో కలిసి నివాళి అర్పించిన జగన్

వైఎస్సార్‌ అడుగుజాడలో...!

రాజకీయాలు తెలియనుటువంటి వాళ్లు కూడా ఆ మహానేత చేసిన సంక్షేమ పథకాలతో స్ఫూర్తి పొంది..అందులో తాము భాగస్వామ్యం కావాలని రాజకీయాల్లోకి వస్తుంటారు. నేను కూడా అలానే రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన ఒక సొంత బిడ్డలా ఆదరించి..రాజకీయాల్లో అవకాశాలు కల్పించారు. ఆనాడు వైఎస్సార్‌ చిరునవ్వుతో బయటకు వస్తున్నారంటే ప్రజలకు ఏదో సంక్షేమ పథకాన్ని అందిస్తున్నారనుకునే వాళ్లం. ఈ రోజు జగన్ మోహన్‌రెడ్డి అటువంటి పరిపాలనే అందిస్తున్నారు. ఒక మేనిఫెస్టో తయారుచేసి అది ప్రజల ముందే ఉంచి దాన్ని నూటికి నూరు శాతం అమలు పరుస్తున్నారు. ఒక్క వైఎస్సార్‌ కుటుంబం ద్వారానే ఈ రాష్ట్రంలో పూర్తిస్థాయి సంక్షేమం అందుతుందని ప్రజలంతావిశ్వసిస్తున్నారు. 

టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల వల్ల కొంతమందికే లబ్దిచేకూరేది. ఈ రోజు ఏ కమిటీతో పనిలేదు...ఎలాంటి రికమండేషన్‌లు అవసరం లేకుండా పారదర్శన పాలన కొనసాగుతోంది. అర్హత ఉన్నవాళ్లను వాలంటీర్లే గుర్తించి..వాళ్ల ఇంటి వద్దకే వెళ్లి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఒక గొప్ప విజన్..మంచి చేయాలనే ఆలోచన ఉంటేనే ఇదంతా జరుగుతుంది. ఆనాడు మన రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే తీర్చిదిద్దాలని వైఎస్సార్‌ కలలు కన్నారో...ఆ  హరితాంధ్రప్రదేశ్‌, అభయాంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు.

వైఎస్సార్‌ మరణం తర్వాత...!

వైఎస్సార్‌ మరణాన్ని ఎవ్వరం ఊహించలేదు. వైఎస్సార్‌ మరణవార్త విని రాష్ట్రంలో ఎంతో మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఒక కుటుంబ పెద్దను
కోల్పోయి..హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేక బాధ పడుతున్న సమయంలో...వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైన కుట్రలు చేశారు. కుటుంబపెద్దను కోల్పోయిన వాళ్లు ఎంత
క్షోభ అనుభవిస్తున్నారో అర్థం చేసుకోకుండా...వారికి అండగా నిలబడాల్సిన వాళ్లే అనవసర ఆరోపణలు చేయడం నాకెంతో బాధకలిగించింది. వైఎస్సార్‌ చేసిన
మేలుకు జీవితాంతం ఆయన కుటుంబానికి అండగా నిలబడాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. 

చివరి వరకు వైఎస్‌ఆర్‌ కుటుంబంతోనే...!

రాజశేఖర్‌రెడ్డి కుటుంబం అంటే మాట ఇస్తే మడమ తిప్పరని అందరికి తెలుసు. నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడూ అండగా ఉంటారు. అలాంటి కుటుంబానికి రాజకీయాలు ఒక్కటే కొలమానంగా తీసుకోలేం...విశ్వసనీయత, విలువలు కూడా ఆ కుటుంబంలో ఓ భాగం. సామాన్య దలితురాలైన నన్ను వాళ్ల కుటుంబ సభ్యురాలిగా చూడటం నేనిప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ జగన్‌మోహన్‌ రెడ్డి ఓ తోబుట్టువులా ఎంతో అప్యాయంగా పలకరిస్తారు. రాజకీయాలతో పాటు ఆ విలువలు కూడా పాటించిన నాయకుడితో కలిసి నడవడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్సార్‌ కుటుంబంతోనే ఉంటాను. 

రాజకీయాల నుంచి తప్పుకుందామనుకున్నా...!

2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు సరిపోనేమో అని దూరంగా ఉందామనుకున్నాను. కానీ రాజకీయాల్లో మంచి వాళ్లు ఉండాలని..నీ లాంటి వాళ్లు రాజకీయాలకు అవసరమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా, ధైర్యం, నమ్మకంతోనే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాను. హోం మినిస్టర్‌ అవుతానని నేను ఏ రోజు అనుకోలేదు. ఒక దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వాలన్న గొప్ప ఆలోచన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రావడమన్నది ఆయనలోని అంబేద్కర్ భావజాలనికి స్ఫూర్తి. రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్సార్ కుటుంభంతోనే నా ప్రయాణం కొనసాగుతుంది.

 

"

Follow Us:
Download App:
  • android
  • ios