వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి-బిజెపి మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్, బిజెపిలు ఎన్నడూ విమర్శించుకోని విషయాన్ని ప్రస్తావించారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోక పోవటమే తన నిదర్శనంగా నిమ్మకాయల అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఈ కారణంతోనే బీజేపీ, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉందేమోనని అనుమానం వస్తోందన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని జగన్ అన్న తర్వాత కూడా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మంత్రుల రాజీనామాల గురించి మాట్లాడుతూ, రాజీనామాలు చేయటం వారిష్టమన్నారు. బిజెపి విషయంలో తామిప్పటికీ మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని చినరాజప్ప పేర్కొన్నారు. ఏపీ బీజేపీ నేతలు వాస్తవ పరిస్థితిని కేంద్రానికి తెలపాలని వ్యాఖ్యానించారు.