హిందూపురం వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్య: ఐదుగురిపై కేసు

హిందూపురం వైసీపీ నేతచౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీఇక్బాల్ పై రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యలు, ఆయన వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు.
 

Hindupur Police Files Case Against Five persons in YCP leader  Ramakrishna Reddy murder

హిందూపురం: వైసీపీ నేత చౌళూరు రామకృష్ణారెడ్డి  హత్యకేసులో ఐదుగురిపై ఆదివారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణారెడ్డి మృతదేహంతో ఆయన వర్గీయులు, కుటుంబ సభ్యులు హిందూపురంలో ఇవాళ ఆందోళనకు దిగారు. రామకృష్ణారెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో ట్రాఫిక్ జాం అయింది.పరిస్థితి ఉద్రిక్తంగా మరింది. విషయం తెలుసుకున్న కదిరి డీఎస్పీ రమాకాంత్ హిందూపురం చేరుకని ఆందోళనకారులతో చర్చించారు. ఈ హత్య వెనుక ఎవరున్నాకఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకొంటామని  హామీ ఇచ్చారు.  రామకృష్ణారెడ్డిని కొంత కాలంగా పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని కూడా మృతుడి  కుటుంబ సభ్యులు ఆరోపించారు. రామకృష్ణారెడ్డి హత్యకు పరోక్షంగా పోలీసులు సహకరించారని వారు ఆరోపించారు. సీఐ,ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ జీటీ  నాయుడు, ఎస్ఐ కరీంలపై మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలుచేశారు. వీరిని  వీఆర్ కు పంపేందుకు చర్యలు తీసుకొంటామని డీఎస్పీ రమాకాంత్ ఆందోళన కారులకు హామీ ఇచ్చారు. 

ఎమ్మెల్సీ ఇక్బాల్  పీఏపై ఇటీవలనే రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. మరో వైపు హిందూపురం సీఐ జీటీ నాయుడిపై కూడా జాతీయ బాలల హక్కుల సంఘానికి  రామకృష్ణారెడ్డి పిర్యాదుచేశాడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరణ విషయంలో  రామకృష్ణారెడ్డికి ప్రత్యర్ధి వర్గానికి గొడవ జరిగింది.  ఈ  సమయంలోనే అతడిని హత్య చేస్తామని ప్రత్యర్ధులు బెదిరించారని రామకృష్ణారెడ్డి వర్గీయులు మీడియాకు చెప్పారు.  

also read:కళ్లలో కారంపొడి చల్లి, వేటకొడవళ్లతో నరికి ... హిందూపురంలో వైసిపి నేత దారుణ హత్య

రామకృష్ణారెడ్డి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదుచేశారు.హత్యకేసులో గోపికృష్ణ,చాకలి రవి,మురళి, కేబీ నాగుడుపై  కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితులపై147, 148,120 బీ, 302  ఆర్/ డబ్ల్యు, 149  సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.  మరో వైపు సీఐ జీటీనాయుడు , ఎస్ఐ కరీంలను వీఆర్ కు పంపుతామని డీఎస్పీ హామీ ఇచ్చారు.

హిందూపురం రూరల్  సీఐ, ఎస్ఐలు వీఆర్ కు

హిందూపురం రూరల్ సీఐ  జీటీనాయుడు, రూరల్ ఎస్ఐ కరీంలను  వీఆర్ కు పంపుతూ ఆదివారం నాడు మధ్యాహ్నం  ఉత్తర్వులు జారీ అయ్యాయి.రామకృష్ణారెడ్డి మృతదేహంతో ఆందోళన చేస్తున్నవారికి కదిరి డీఎస్పీ రమాకాంత్ ఈ మేరకుహామీ ఇచ్చారు. ఈ విషయమై డీఎస్పీ ఉన్నతాధికారులకు  సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆదారంగాఈ ఇద్దరు అధికారులను వీఆర్ కు పంపుతూ  ఉత్తర్వులు జారీ చేశారు. 
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios