అనంతపురం:తన మౌనాన్ని చేతగానితనం అనుకోకూడదని సినీ నటుడు బాలకృష్ణ వైసీపికి వార్నింగ్ కు ఇచ్చారు.. తాను కనుసైగ చేస్తే నిన్న పరిస్థితి ఎక్కడికి దారి తీసేదో చెప్పాలని  ఆయన  వైసీపీ నేతలను ప్రశ్నించారు.నా వెనుక వందల మంది ఉన్నా కూడ నేను మౌనంగా ఉన్నా, నా మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దని బాలకృష్ణ వైసీపీకి కౌంటరిచ్చారు.

also read:హిందూపురంలో బాలయ్యకు నిరసన: రాయలసీమ ద్రోహి అంటూ....

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ శుక్రవారం నాడు వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. గురువారం నాడు బాలకృష్ణ హిందూపురం పర్యటనను పురస్కరించుకొని వైసీపీ నేతలు బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకొన్నారు. రాయలసీమ ద్రోహి అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు.ఈ ఘటనపై బాలకృష్ణ ఇవాళ స్పందించారు.

మంత్రులకు అవగాహన లేదని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.తమ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ది కళ్లెదుటే కన్పిస్తోందని బాలకృష్ణ చెప్పారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ఖసాధింపు చర్యలతో అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో జగన్ పాలన అంతా రివర్స్‌లో సాగుతోందని ఆయన విమర్శించారు.  ఒకే రాష్ట్రం ఒకే  రాజధాని తమ నినాదమని బాలకృష్ణ స్పష్టం చేశారు.  తండ్రి శాసనమండలిని తెస్తే కొడుకు శాసనమండలిని రద్దు చేశాడని ఏపీ సీఎం జగన్‌పై బాలకృష్ణ మండిపడ్డారు.

మండలి చైర్మెన్‌పై మంత్రులు మాట్లాడిన భాష చాలా బాధాకరంగా ఉందని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.014, 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి బాలకృష్ణ వరుసగా విజయం సాధించారు.  2019 ఎన్నికల్లో బాలకృష్ణపై వైసీపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 

ఏపీ రాష్ట్రంలో మూడు రాజధానులను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపురానికి వచ్చిన బాలకృష్ణకు వ్యతిరేకంగా గురువారం నాడు వైసీపీ నేతలు అడ్డుపడ్డారు.

బాలకృష్ణ కాన్వాయ్ కదలకుండా అడ్డుపడ్డారు.  ఈ  విషయం తెలుసుకొన్న టీడీపీ కార్యకర్తలు కూడ బాలకృష్ణ కాన్వాయ్ వద్దకు చేరుకొని ఆయనకు రక్షణగా నిలబడ్డారు.ఈ సమయంలో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి బాలకృష్ణ కాన్వాయ్‌ను అక్కడి నుండి  పంపించివేశారు.ఈ ఘటనపై బాలకృష్ణ ఇవాళ ఘాటుగా స్పందించారు.