అనంతపురం: జిల్లాలో గతంలో జరిగిన మర్డర్ల మరకలను తూడ్చేందుకు సీఎం జగన్ నీళ్లిస్తున్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. ఫ్యాక్షన్ రూపుమాపడం కోసమే నీళ్లు ఇస్తున్నారని తాను చెప్పానని ఇందులో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు.

రెండు రోజుల క్రితం పరిటాల రవితో పాటు చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్  తీవ్రమైన విమర్శలు చేశారు.ఈ విమర్శలపై మాజీ మంత్రి పరిటాల సునీత గురువారం నాడు స్పందించారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పరిటాల సునీత వ్యాఖ్యలపై మాధవ్ ఇవాళ స్పందించారు.ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఈ విషయమై  ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు.

also read:నీ చరిత్ర మాకు తెలుసు.. గోరంట్ల మాధవ్‌ కు పరిటాల సునీత వార్నింగ్...

గతంలో ఈ జిల్లాలో జరిగిన ఘటలను అందరికి తెలుసునని ఆయన చెప్పారు.అప్పట్లో పెద్ద ఎత్తున హత్యలు జరిగాయన్నారు. చనిపోయిన వాళ్లు గుంతల్లో ఉన్నారు, బతికున్నవాళ్లు జైల్లో ఉన్నారని ఆయన చెప్పారు.

క్లైమోర్ మైన్, లాండ్ మైన్, టీవీబాంబు, కారు బాంబులను ఈ జిల్లాకు పరిచయం చేసిన ఘటనలున్నాయన్నారు.  తాను రేపిస్ట్ అని కూడ నిరూపించాలని ఆయన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.

ఫొలాలకు నీళ్లు లేని సమయంలో రక్తం మరకలతో పొలాలను పరిటాల రవి తడిపాడని రెండు రోజుల క్రితం మాధవ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  మాధవ్ వ్యాఖ్యల వెనుక ఎవరైనా ఉన్నారేమోనని పరిటాల సునీత అనుమానించారు.