ఆంధ్రప్రదేశ్ లోని పులివెందులలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ హిజ్రామీద పదిమంది అత్యాచారానికి పాల్పడ్డారు.
పులివెందుల : వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకులకు మహిళలు, పసివాళ్లు, యువతులు, ముసలివాళ్లు అన్న తేడా కాదు.. స్త్రీ, పురుషుడు, హిజ్రా అనే తేడాలూ లేకుండా పోయాయి. కన్ను పడితే చాలా వారిమీద అత్యాచారం చేసి కానీ వదిలిపెట్టడం లేదు. అలా ఓ హిజ్రా మీద అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏపీలోని పులివెందులలో ఓ హిజ్రాపై పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం ఓ హిజ్రా (35) పట్టణంలో ఒంటరిగా నివాసం ఉంటోంది. రెండు రోజుల కిందట పదిమంది ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసింది.
ఇదిలా ఉండగా, నిరుడు నవంబర్ లో ఓ హిజ్రా చేసిన పనికి చంటిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. చంటిబిడ్డను తల్లి దగ్గర్నుంచి లాక్కున్న ఓ హిజ్రా..డబ్బులిస్తేనే విడిచిపెడతానని డిమాండ్ చేసింది. చివరకు, హిజ్రా ఒడిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బెంగాల్ లోని మాల్దా జిల్లాలో ఈ విషాదం జరిగింది. బంగ్లా గ్రామంలో నివసించే మంపి సర్కార్ దంపతులకు అక్టోబర్ 29న ముగ్గురు పిల్లలు పుట్టారు. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం కొంతమంది హిజ్రాలు సర్కార్ ఇంటికి వెళ్లారు. పిల్లలకు దీవెనలు అందిస్తామంటూ రూ.5వేలు డిమాండ్ చేశారు.
తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలు: దొంగ ఓట్లు, అక్రమ అరెస్ట్‌లతో గెలిచే యత్నం.. వైసీపీపై టీడీపీ ఆరోపణలు
అంత మొత్తం ఇవ్వలేమని కుటుంబసభ్యులు అనడంతో వారితో వాదనకు దిగారు. అంతలోనే ఔలద్ అలీ అనే హిజ్రా.. ఓ శిశువును తన ఒడిలోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. తమ వద్ద ఉన్న రూ. 500 ఇస్తానన్నా వినిపించుకోలేదని.. శిశువుకు నలతగా ఉందని, పాలు పట్టాలని చెప్పినా వినిపించుకోలేదన్నారు. కాగా ఈ హాడావుడి, గందరగోళం, తోపులాటలో ఆ చిన్నారి చివరికి హిజ్రా చేతిలోనే బిడ్డ ప్రాణం విడిచిందని తల్లి బోరుమంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అలీని అరెస్ట్ చేశారు.
కాగా, నిరుడు ఆగస్టులో గుంటూరులోని వెంకటాద్రి పేటలో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. చందన అనే హిజ్రా హత్యకు గురైంది. చందన తన వెంటపడి వేధిస్తుండడంతో అదే ప్రాంతానికి చెందిన యువకుడు ఆగ్రహానికి లోనయ్యాడు. రోకలిబండతో హిజ్రాను తలమీద గట్టిగా కొట్టాడు. తలమీద బలమైన గాయం కావడంతో చందన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
