ఓరకల్లు మండలంలో పిన్నాపురం గ్రామాన్ని విలీనం చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తూ స్థానికులు చేసిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో గ్రామస్తుల రాళ్లదాడిలో పాణ్యం తహసీల్దార్‌కు గాయాలయ్యాయి.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురంలో గ్రామసభ రసాభాసగా మారింది. ఓరకల్లు మండలంలో పిన్నాపురం గ్రామాన్ని విలీనం చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. పిన్నాపురంలో కరకట్ట ఓపెన్ బ్లాస్టింగ్‌తో ఇళ్లకు బీటలు వస్తుండటంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం గ్రామ సభకు హాజరైన గ్రీన్ కో సంస్థ నిర్వాహకులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులకు సర్ది చెప్పడానికి పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ప్రయత్నించారు. అయితే స్థానికులు రాయి విసరడంతో పాణ్యం తహసీల్దార్ నాగమణి తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
